*న‌గ‌రంలో నాలా స‌మ‌స్య‌ల‌కు చెక్‌*

0
69
Spread the love

 *రూ. 298 కోట్ల 34 ల‌క్ష‌లతో 472 డ్రెయిన్ వ‌ర్క్స్ కు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీచేసిన పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్‌*

*హైద‌రాబాద్‌సెప్టెంబ‌ర్ 30:*   గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నాలా కష్టాలు తోలగించేందుకు చెపడుతున్న పనులకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రూ. 298 కోట్లతో  చెపట్టనున్న 472 పనులకు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిటిలో ప్రమాదకరంగా ఉన్న  ఓపెన్ నాలాలకు పై కప్పులు వేయ్యడం…, రిటైనింగ్ వాల్ నిర్మించడం తో పాటు ఇతర రక్షణ చర్యలు జిహెచ్ఎంసి అంత‌ర్గ‌త నిధుల ద్వారా పనులు చేపట్టనుంది.

నగరంలో రెండు మీటర్లకన్న తక్కువ వెడల్పు ఉండి…, ఫై కప్పులేని నాలాలకు పై కప్పు వేయ్యాలని…, 2 మీటర్ల కంటే  ఎక్కువ వెడల్పు ఉన్న నాలలకు రిటైనింగ్ వాల్ నిర్మించడం తోపాటు…, తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని  జిహెచ్ఎంసి ఉన్నతాదికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులకు ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు స్ప‌ష్టం చేశారు. దాంతో వివిధ ప్రాంతాల్లోని నాలాలను స్టడి చేసిన ఇంజనీరింగ్ అధికారులు  మొత్తం 472 ప్రాంతాల్లో నాలాల  అభివృద్ది  పనులకు  ప్ర‌తిపాద‌న‌లు పంపారు. ఆరు జోన్లలో 2మీటర్లకన్న తక్కువ వెడల్పు ఉన్న నాలా పనులు 382 ఉండగా…, అందుకోసం రూ. 233 కోట్లు ఖర్చు అవుతాయని అంచ‌నా వేశారు.  2మీటర్లకన్న ఎక్కువ  వెడల్పు ఉన్న నాలాల్లో  90 పనులు చేపట్టాలని నిర్ణయించగా, అందుకోసం రూ. 65.32 కోట్లు ఖర్చు అవుతాయని అంచ‌నా వేశారు.

క్ర.సంఖ్య

జోన్

మీటర్ల వెడల్పు వరకు ఉన్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్

మీటర్ల వెడల్పు కంటే ఎక్కువ ఉన్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్

ప్రతిపాదిత పనుల సంఖ్య

అంచన వ్యయం రూ. కోట్లలో

 ప్రతిపాదిత పనుల సంఖ్య

అంచన వ్యయం రూ. కోట్లలో

1

ఎల్బీనగర్

117

71.61

20

15.26

2

చార్మినార్

42

29.75

5

2.84

3

ఖైరతాబాద్

33

22.24

11

10.82

4

శేరిలింగంపల్లి

71

29.27

18

9.67

5

కూకట్ పల్లి

95

60.97

26

24.99

6

సికింద్రాబాద్

24

19.18

10

10.74

మొత్తం

382

233.02

90

65.32

 ఎల్బీనగర్ జోన్  అత్యదికంగా 137 ప్రాంతాల్లో నాలాలను డెవలప్ చేయ్యాల్సి ఉండగా అందుకోసం  రూ. 86.87 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు జిహెచ్ఎంసి అదికారులు,  చార్మినార్ జోన్ పరిధిలో 47 పనులకోసం రూ. 32.59 కోట్లు,  ఖైరతాబాద్ జోన్ పరిధిలో 44 పనులకోసం రూ. 33.06 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 89 పనులకు రూ. 38.94 కోట్లు, కుకట్ పల్లి జోన్ లో 121 పనులకు రూ. 85.96 కోట్లు,  సికింద్రాబాద్ జోన్ పరిధిలో 34 పనులకోసం రూ. 29.92 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలతో పనులు చెపట్టేందుకు  పరిపాలన అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి జిహెచ్ఎంసి లేఖ రాసింది. దాంతో అనుమతులు ఇస్తూ  పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు.

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here