అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన గీతం వ‌ర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి

0
605
Spread the love

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన గీతం వ‌ర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి

శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి ద‌ర్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి మృతిచెందారు. రెండు తెలుగు రాష్ట్రల ప్ర‌ముఖ‌లు ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.

ఎంవీవీఎస్‌ మూర్తి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నందమూరి బాలకృష్ణ

శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి మృతి పట్ల సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా, శాసనమండలి సభ్యులుగా విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విద్యారంగ అభివృద్ధికి నిరంతరం తపించే వ్యక్తి ఎంవీవీఎస్‌ మూర్తి అని.. ఏ పదవిలో ఉన్న నీతి, నిజాయతీగా పనిచేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here