ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిగిన‌ ఎంవీవీఎస్ మూర్తి అంత్య‌క్రియ‌లు

0
446
Spread the love

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జ‌రిగిన‌ గీతం విశ్వ‌విద్యాల‌యం అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంత్య‌క్రియ‌లు
ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గీతం విశ్వ‌విద్యాల‌యం అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. అమెరికా నుంచి ఆయ‌న పార్థీవ దేశ‌షం ఈ రోజు ఉదయం విశాఖ‌పట్నంకు చేరుకుంది. సిరిపురంలోని ఆయ‌న నివాసానికి దేహాన్ని త‌ర‌లించారు. ఆ త‌ర్వాత తేదేపా కార్యాల‌యంలో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ప్ర‌జ‌ల సంద‌ర్శ‌ననార్థం ఉంచారు. ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రువ‌లేవ‌ని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు. మంత్రి శ్రీ‌నివాస‌రావు , బీజేపీ నేత పురంధ‌రేశ్వ‌రి మూర్తి మృత‌దేహానికి నివాళులర్పించారు. రుషి కొండ వ‌ర‌కు అంతిమయాత్ర నిర్వ‌హించిన అనంత‌రం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియలు జ‌రిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here