ఇజాలు ప్రపంచ ప్రజల మీద వాటి ప్రభావం

0
213
Spread the love

ఇజాలు ప్రపంచ ప్రజల మీద వాటి ప్రభావం

ప్రపంచ మానవ గమనం  మనం పరికించినట్లైతే ఒక్క భారత దేశం మినహాయిస్తే  కేవలం పంతొమ్మిదవ శతాబ్దం లోనే యూరోపు, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలలో నాగరిక సమాజాలు, మానవ జీవన వికాసము, జీవన వికాసం కొరకు ఆయా ప్రాంతాలలోని ప్రజలు వారి వారి సమూహాలుగా ఏర్పడి సంఘర్షణలు చేయడం మనకు చరిత్ర ద్వారా తెలిసిన విషయమే.

19  వ శతాబ్దం పూర్తి ప్రపంచ ఆధునిక మానవ చరిత్రకు మలుపుగా మనం జరిగిన సంఘటనలు, సంఘర్షణల ఆధారంగా తెలుసుకునే వీలు కలుగుతోంది అని మనం అంగిలంకరించాల్సిన సత్యమే.

ఈ చారిత్రిక విషయాలలోనే మనం ప్రపంచంలో అత్యంత సహజ సిద్ధ మార్పులను ఆ మార్పుల ద్వారా ప్రజలలో ఇజాలు వారి వారి జీవన సౌలభ్యం కొరకు సంఘటనలుగా మారి సంఘర్షణ, ఘర్షణ వాతావరణాలను చవిచూసి నెమ్మదిగా అవ్వి స్థిరపడి ఆయా జాతుల మధ్యన అవగాహన కలుగ చేసుకొని పూర్తి స్థాయి దేశాల మధ్యన విభజన రేఖలు రావడం కూడా మానవ సమాజం అనుభవించినదే.

 ఫాసిజం ఆవిష్కారం

ఫాసిజం, ఫాసిస్టిక్ ఆలోచనా అనే ఒక క్రొత్త కోణం ఆవిష్కారం యూరోపు దేశాలలో 1900 లలోనే పురుడు పోసుకున్నది సత్యం. అసలు ఈ ఇజానికి అర్ధం ఏమిటి అని వారిలో వారు తర్జనలు చేసుకున్న తరువాత తేల్చినది ఏమిటి అంటే జాతీయతా వాదము అని. ముస్సోలిని అనండి, హిట్లర్ అనండి వీరిని ప్రక్కన పెడితే దాదాపుగా యూరోపు మధ్య అమెరికా ప్రాణతం అంతా కూడా ఈ జాతీయతా వాద పోకడలు, ఫ్రాన్సు లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం, అమెరికాలో చెలరేగిన తిరుగుబాట్లు ఈ యొక్క ఆలోచనను బలపరచినవే అని మనం గ్రహించగలం.

ఈ జాతీయవాద పోకడ ప్రమాదంగా మారడానికి కారకాలు అనేకం కావచ్చును. అందులో ఒకటి మాత్రం ఎలాగూ ఇంతటి పెద్ద సంఘటనను ఏర్పరచాము కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని జయించలేనా అని, ప్రపంచం మీద ఆధిపత్యం సాధించిన తరువాత నాదేశం ప్రపంచం లోనే అతి గొప్పదేశంగా వెలుగులు చిమ్ముతుంది కదా అనే కంటకమైన ఆలోచన ఈ యొక్క ఇజానికి బలాన్ని చేకూర్చడం చేతనే రెండవ ప్రపంచ యుద్ధపు ఛాయలు ప్రపంచం మీద వ్యాపించి దాదాపుగా ప్రపంచ మానవాళిలో 4 శాతం ప్రజలు ఆహుతులు కావడం కాదనలేని సత్యం. జాతీయ వాదం అనేది ప్రక్కనకు పోయి అనార్కిస్టు బయటకు రావడం చూశాము.

అనార్కిజం

అనార్కోస్ అనే గ్రీక్ పదం నుంచి అనార్ఖిజం వచ్చినది అని తెలియచేయబడుతోంది.  అనార్కోస్ అనగా “ఏ విధమైన అధికారికం కాని”   “whithout any authority” అని అర్ధముగా తెలియచేయబడినది. ఇంగ్లాండ్ సివిల్ వార్ సందర్భంగా ప్రపంచంలో  మానవ అణచివేతను అనుభవించేవారిని సంభోధిస్తున్న రాడికల్ లెవెలర్స్ అనబడే అతివాద తిరుగుబాటుదారులను “స్విట్జరైసింగ్ అనార్కిస్టూలు” అని పిలిచే వారు.  దినికి అర్ధం ఆ జాతుల వారే తెలియ చేస్తే బాగుంటుంది.

సాధారణంగా అనార్కిస్టులు ప్రజలు తాము తయారు చేసుకునే చట్టాలను ధిక్కరిస్తారు, అతి కాటిన్యంగా ధనం పోగుచేస్తారు, అంటే మనుషులను హింసలకు గురిచేసి బానిసలుగా మార్చి వారి శ్రమకు తగిన మూల్యము చెల్లించక అడ్డదారులలో ధన సంపాదనలో వారి లక్ష్యం చేరుతారు. వారే ఇలా కూడా అంటూ వుంటారు ధనం ఎప్పుడైతే ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుందో అక్కడ నేరం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని.

1840 ప్రాంతాలలో  పెర్రీ జోసెఫ్, కార్ల్ మార్క్స్, ది కంమ్యూనిస్టు మేనిఫెస్టో, దాస్ కాపిటల్ మొదలైన పుస్తకాలు వ్రాసినారు కమ్యూనిస్టులకు వారి పుస్తకాలు బైబిలు వంటివి,   మిఖైల్ బకునిన్ ఈయన రష్యన్ రివొల్యూషనరీ. ఉత్తరోత్తరా వీరు అనార్కిజం అనేది విస్తృతంగా చర్చించిన మీదట కొన్ని భిన్నాభిప్రాయాలతో ఐనప్పటికీ కొంతలో కొంత వారి ఆలోచనలు ఏకీకృతం చేస్తూ, ధనం అనేది కొంతమంది చేతిలో గనుక ఉంటే అది అనార్కిజానికి దారితీస్తుంది, అప్పుడు మానవులు హింసకు గురి అవుతారు తద్వారా అధికారం సిద్ధింప చేసుకొని కాపిటలిజం అంటే ధనవంతుల రాజ్యాలు ఏర్పడుతాయి అని తెలియచేయడం జరిగింది.

కాపిటలిజం

ధనము, అధికారము సిద్ధించిన వేళ ప్రజలను వారి శ్రమను కేవలము ధనము తోటే తూకం చేసే వ్యవస్థ అని పైన వచించిన సిద్ధాంత కర్తలు తీర్మానించింది మాత్రమే. ఆ విధంగా అనుకుంటే యూరోపు దేశాలు ముఖ్యంగా అమెరికా కాపిటలు సిద్ధాంత కర్తల దేశము అని కమ్యూనిస్టులు అంటూ వుంటారు, మరేమో అక్కడ మితిమీరిన ప్రజాస్వామ్యము కనపడుతుంది. ఏ వ్యవస్థలో చూసినా మనకు కనపడేది పని ఉంటుంది పనికి తగిన ప్రతిఫలం ఆశిస్తూ వుంటారు, ఆ విధంగా ప్రతిఫలం దొరకకుంటే అ వ్యవస్థను ప్రశ్నించడం తద్వారా పనివారు తమ ప్రతిఫలం సిద్ధింప చేసుకోవడం చూస్తూనే వున్నాము. అమెరికాలో పని వారి ప్రతిఫలం తాము చేసే పనికన్నా ఎక్కువగానే ఉండటం, అందరికి తిండి, వస్త్రం, ఇల్లు కల్పించడం రాజ్యం చేస్తూనే వున్నది. అమెరికా నల్లవారు కూడా అధినేతలు కావడం మనం చూసే వున్నాము. మరి అమెరికాను ప్రజాస్వామ్య దేశం అందామా కేవలం ధనికుల వ్యవస్థ కలిగిన దేశం అందామా భారత దేశం లోని కామినిస్టులను అడిగితేనే బాగా తెలియచేయగలరు.

కమ్యూనిజం

కమ్యూనిజంలో అధికారం మొత్తం ఒక కమిటీ చేతిలో ఉంటుంది. ఆ కమిటీ తమదేశంలోని ప్రజలు అందరికి పని కల్పిస్తుంది తద్వారా చేకూరే ఆదాయాన్ని దేశ ప్రజలు అందరికి పంచుతుంది. కుడు, గుడ్డ, గూడు వారే ఆ యా ఆదాయ వర్గాల పరిమితులకు తగిన విధంగా ఏర్పాటు చేస్తుంది.

1919 రష్యాలో  జారు చక్రవర్తుల నుంచి అధికారాన్ని కమ్యూనిస్టులు  హస్తగతం చేసుకున్న తరుణంలో ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధంలోనూ జరుగనంత మారణహోమం జరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు, రాశారుకూడా. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అంతమంది జన హననం జరుగలేదని చరిత్ర కారుల ఉవాచ. 1980 వ సంవత్సరానికి ఎందుకు అది కుదేలు అయ్యింది అనేది ప్రపంచ కమ్యూనిస్టు మేధావుల మేధో మధనానికి అందని విషయంగా అర్ధం అవుతున్నది. వారు ఎప్పుడు చారిత్రిక తప్పిదాలు చేస్తూ వుంటారు అది అంతే. కాకపోతే ఈ మేధావులు భారత దేశంలోని పశ్చిమ బెంగాలు రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోని తమ సిద్ధాంతంలో వున్నా లొసుగులను గనుక సరిదిద్దుకో గలిగితే అది కేవలం నేటి భారత ప్రభుత్వం చేస్తున్న రాజకీయ పక్షం యొక్క సిద్ధాంతానికి సరితూకమే అవుతుంది.

చైనా లోని కమ్యూనిజం అనేదానికన్నా కాపిటలిస్టు కమ్యూనిజం అని వారిని అంటే సరిపోతుంది. తమకు గిట్టని వారిని ఉరికంబం ఎక్కిస్తారు. వేల మంది మనుషులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేస్తారు ప్రపంచంలో మాత్రం మానవహక్కుల సంఘాలను వారే స్థాపించి పోషిస్తూ వుంటారు. వారి దేశంలో అవినీతి పరులను తాట తీసి వేలాడదీస్తారు, అదే వేరు దేశాల్లో అవినీతిని ప్రోత్సహించి చరిత్రకారులను, రాతకారులను, మీడియాలో వున్నా రచయితలను తమ వైపుకు తిప్పుకొని ఆ యా దేశాలలో హింసను ప్రోత్సహిస్తారు. ఆ దేశంలో కమ్యూనిస్టులు వర్గాలవారీగా విభజించబడి వున్నారు, సంపాదనను బట్టి కాలనీలు ఉంటాయి. వారి దగ్గర కూడా సొంత వ్యాపారాలు చేసుకునే వారు వున్నారు. ఆస్తులు కూడబెట్టుకునే వారు వున్నారు.

భారతీయ కమ్యూనిస్టులు ఇంక ఏమి చెప్పుకోవాలి. భూమి గుండ్రంగా వున్నదని ఇప్పుడు బైబిలు కూడా వొప్పుకుంటుంటే ఆదిమాత్రం చైనా చెబితేనే నిజం అని ఒప్పుకుంటారు. లేదంటే బల్లపరుపుగా ఉన్నదంటారు, నిటారుగా ఉన్నదంటారు వారు భారతీయ ల్యూటియనులు. సరళంగా చెప్పుకోవాలంటే ‘గందరగోళ తికమక మకతిక మానసిక వ్యాధిగ్రస్తులు’ అని మనం వారి గురించి చెప్పుకోవడానికి వీలు కలుగుతుంది.

భారతీయత, జాతీయత, ఏకాత్మ మానవతా వాదం

భారతీయులు సహజంగా ఉదారవాదులు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ దేశం చైతన్యాన్ని సాధించినది. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరిక దేశం అని ప్రపంచ చరిత్రకారులే చెబుతుంటారు.

ఇదే విషయం మన వారు చెబితే వెంటనే భారత కమ్యూనిస్టులు, లిబరాన్డులు, యాక్టివిస్టులు, NGO ముసుగులోని విదేశీ తొత్తులు, మీడియాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ల్యూటియనులు గొంతులు కలిపి గందరగోళం సృష్టిస్తారు.  దీనికి చిన్న ఉదాహరణ అక్బర్ పరమత సహనం కల చక్రవర్తి అని CBSE పుస్తకములో రాసివున్నది. దీనిమీద  CBSE వారిని సంప్రదించి ఇదినిజముగా జరిగినదా, జరిగితే అది ఎక్కడనుంచి తీసుకున్నారో తెలుపగలరు అని ప్రశ్నించిన మీదట వారు తెలిపినది అక్బర్ విషయముకు మాదగ్గర ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు అని. మరి ఆ పుస్తకము రాసినది ఎవరు అని ఆరా తీస్తే అదే మన భారతీయ ల్యూటియనులు అని తెలిసినది ఈ ల్యూటియనులు కామినిస్టు గాంగ్ చరిత్రకారులు. వీరికి ధనలోకం ఎదవ శరీరం. ఇంతటి దుర్మార్గులు తమ తల్లిని తామే పతిత అని చెప్పుకోగల సమర్థులు.

ఇంతటి చారిత్రక వ్యాసం అసలు ఎందుకు మీముందుంచడం జరిగినది అనేదానికి మూలం ఇప్పుడు తెలియపరుస్తాను. భారత దేశం ఇప్పుడు ఫాసిస్టుల చేతిలో వున్నది. ఈ ఫాసిస్టు గనుక అధికారం నుంచి గెంటివేయక పోతే  భారతీయతకు ప్రమాదం అని మాకియవెల్లి, గోబెల్స్ ప్రచారం బాగా ఊపందుకుంటున్నదని రోజువారీ పేపర్ చదివే వారికి బాగా అర్ధం అవుతుంది.

ఎవరిని గురించి అంటే ఇంక ఎవరు దొరుకుతారు అండీ నరేంద్ర మోడీ గారేను కదా. తీవ్ర జాతీయవాదం వరకు వప్పుకుంటాము అది లేకపోతే దేశమే ఉండదు, ఆ దేశానికి జెండా ఉండదు (చైనా కూడా జాతీయత వున్నా దేశమే వారికి జెండా వున్నది, దేశము వున్నది, ఇతర దేశాలను ఆక్రమించుకుని దేశాభిమానము వున్నది). ఫాసిజానికి వున్నా మరో మాయరోగం ఇతర దేశాలను ఆక్రమించుకోవడం. భారత దేశం అది చేయడంలేదు. మోడీగారు ఆ విధమైన ప్రోత్సాహం చేయడం లేదు. LOC , LAC అనేవి ఈదేశానికి ప్రక్కదేశాలకి  సరిహద్దులుగా గుర్తిస్తే కేవలం ఈ లోపున వున్నా భూభాగ రక్షణను మాత్రమే వారు యోజన చేస్తున్నది. ఇది ప్రతి సగటు భారతీయుని ఆలోచన, కోరిక. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేసినా అది అంతర్జాతియ సమాజం దృష్టిలో నేరమే, అ నేరము ప్రస్తుత ప్రభుత్వం చేయడం లేదు ప్రస్తుత ప్రభుత్వం యొక్క నీతి రీతి కాదు అనేది స్పష్టం.

అసలు భారత దేశ వాదం ఏమిటి అంటే ‘ఏకాత్మ మానవతా వాదం’ “integral humanism”. ప్రతిమనిషిలోను ఒకే ఆత్మ ఉంటుంది. ప్రతి మానవుడికి కనీస వసతి కల్పించడం అనేది ధర్మమూ అని. అందుకే అశోక చక్రాన్ని భారత జాతీయ పతాకంలో వుంచుకున్నాము. ప్రజాస్వామ్య దేశం, ఈ దేశపు ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు ఈ దేశ రాజ్యాంగము నిర్మాణము చేయబడినది. ఆ రాజ్యాంగానికి స్ఫూర్తి ఒక భారత సామాజిక కోణంలో అత్యంత కడగొట్టు కులపు వ్యక్తి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన మనం రాజ్యాంగం తయారు చేసుకున్నాము. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి, అన్నిదేశాలూ తిరిగి వారివారి నియమావళిని క్షుణ్ణంగా పరిశీలించి తద్వారా వచ్చిన సారాన్ని మనము మనల్ని పరిపాలించుకొనే ధర్మగ్రంధము దేశ భగవద్గీతను అంటే రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము.

ఆ రాజ్యాంగము యొక్క అధికారణాలు దాటి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదా? పోనీ అలాటి నిర్ణయాలు తీసుకుంటే మన ధర్మాసనాలు వూరుకుంటాయా? ఆ విధంగా ఈ 7 సంవత్సరాల పాలనాలు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు కదా. మరి ఎందుకు మోడీ గారిని ఫాసిస్టు అని హిట్లరు లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు.

ఎందుకు అంటున్నారంటే ‘లెటర్ అండ్ స్పిరిట్’  అంటారు కదా. అంటే రాజ్యాంగము  ప్రకారము ఏవిధముగా జరగాలి అనేది ఉంటే, ఖచ్చితముగా తూచా తప్పక ఆ విధాన్నాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి అని అర్ధం కావడం లేదా. ప్రజాస్వామ్య బద్ధంగా, మెజారిటీ పక్షము ప్రజలకు మేలు చేసే ప్రక్రియలను ఆచరిస్తూ దేశ నిర్మాణాత్మక కార్యప్రణాళిని ఆచరిస్తున్నారు కదా.

ఫాసిస్టులు, అనార్కిస్టులు, బూర్జువాలు, ప్రపంచ దేశాలను కబళిస్తూ ముందుకు నడుస్తున్నవారు, ప్రపంచదేశాలను తమ వైరసును పంపి వణికిస్తున్నవారు, తీవ్రవాదులను తయారు చేసి ప్రపంచంలో భయ భ్రమతులను రేకెత్తిస్తున్నవారు ఎవరు అంటే అది స్పష్టమే వెంటనే పాకిస్తాను, చైనా, టర్కీ వారి ప్రేరేపణతో తయారైన ISIS వారు అనేది తేటతెల్లం.

130  కోట్ల జనాభా  నా వారు. వారి అందరి వద్దకు వికాసము, అభివృద్ధి ఫలాలను తీసుకోని పోవడమే నా లక్ష్యం అన్న నరేంద్ర మోడీ ఫాసిస్టు అంటారా? శత్రు దేశాలు మాటకు ముందు మన దేశస్థులను హింసిస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా ? దేశంలో అలజడులు సృష్టించి తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేద్దామనుకునే కుట్రదారుల పీచ మాన్చడం తప్పంటారా? సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టి లక్షల కోట్ల రూపాయలు తమ తమ ఖాతాలలో, తమ వారి ఖాతాలలో కలిగి వున్నవారిని గుర్తించి ఆ యా ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు చేర్చడం తప్పు అంటారా? NGO ల ముసుగులో దేశ వ్యతిరేక చర్యలకు పూనుకునే వారిని చీల్చి చెండాడుతుంటే ఆయన  ఫాసిస్టా?

ఇజాలపేరుతో దేశ ప్రజలను మోసగించే కుహనా లౌకిక వాదులు, వ్రతం చెడ్డ కమ్యూనిస్టులు, హక్కుల పేరుతో తప్పుడు పనులకు పూనుకుంటు దేశాన్ని తప్పుతోవ పట్టించాలనుకుంటున్న హక్కుల సంస్థలు, లిబరాన్డులు, ఢిల్లీ  ల్యూటియన్, అర్బన్ నక్సల్ వాదులు, ఈ అర్బన్ నక్సల్ వాదులకు కొమ్ము కాస్తున్న సంస్థల వారు మీరు స్థిమితంగా కూర్చొని మనం ఏ చెట్టు క్రింద వున్నాము, ఆ చెట్టు మొడులు మనం నరకడం లేదు కదా, ఇంతటి చక్కటి దేశం ప్రపంచంలోనే లేదు కదా మరి అటువంటి దేశంలో పుట్టిన మనం ఎందుకు మనవారిని మనమే హింసించుకుంటున్నాము అని తర్కించండి. తప్పును గ్రహించండి. ఈ దేశం మనది, ఏకాత్మ మానవతా వాదం మన వాదం. మనమందరం ముందు మన దేశాన్ని ప్రేమిద్దాం. తరువారు రాజకీయ పదవుల ఆలోచన చేద్దాం. రాజకీయ పార్టీలు వున్నాయి. కరోనా సమయం ఇది. ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు చేరువగా జరగండి. అప్పుడు ప్రజలు మీరు చేసే సేవలను మెచ్చుకుంటారు తద్వారా దేశ రాజకీయ అధికారం సాధించండి మీ ఇజం తోటి మీకు ఇవ్వబడిన అధికారంతో చక్కటి పరిపాలన అందించండి.

గత 67  సంవత్సరాలు జరగని అభివృద్ధి 7 సంవత్సరాలలో ఈ దేశంలో జరిగింది నిజం. దీనిని ఎవరు కాదనలేరు. అందుకే మీరు వేరే పేరులతో ఆ మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వాన్ని  నాశనం చేయ సంకల్పించారు. మనో నిబ్బరము, సేవా సంకల్పము, ధర్మ ఆచరణ చేయగలిగిన వ్యక్తులకు కేవలము పరమాత్మ మాత్రమే సహకరిస్తారు. మీరు కూడా ఆ దారిలో నడుస్తారని ఆశిస్తున్నాను.

ANASUYA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here