Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు కొద్దిగా పైకి!

0
113
Gold Price
Spread the love

ఈ మధ్య కాస్త నిలకడగా ఉంటున్న బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (జనవరి 02) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (02.01.2021) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 46,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,060 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు పైకి..
బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 72వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 72,400 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (02.01.2021) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 46,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 100 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,060 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ధరతో పోలిస్తే 10 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,860 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ధరతో పోలిస్తే 10 రూపాయలు పైకెగసింది. దాంతో 53,310 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-01-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here