Spread the love
అఖండ చిత్ర డైరెక్టర్ బోయపాటి శ్రీను కి ఈ రోజు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. కల్లు మా ట్రెడిషనన్ ఇది మందు కాదు మెడిసిన్ అంటు తెలంగాణ సంస్కృతిని కల్లు ఔన్నత్యం గొప్పగా చెప్పిన సందర్భంగా బోయపాటి శ్రీను కి గౌడ సంఘాలా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను కి ఒక విఙ్ఞాపాన అందజేశారు గౌడ సంఘం నేతలు. నందమూరి బాలకృష్ణ చేత తెలంగాణ పోరాట యోధుడు, గోల్కొండ ను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రం తీయాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, కార్య నిర్వాహక అధ్యక్షుడు బబ్బురి బిక్షపతి గౌడ్, సంఘం రాష్ట్ర నాయకులు పులి శివకుమార్ గౌడ్, యువజన విభాగం నాయకులు కొండ రాంబాబు గౌడ్
ఇతర గౌడ సంఘాల రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నారు.