వ్యవసాయ భూములున్న‌ గిరిజనులకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వండి – గ‌వ‌ర్న‌ర్‌

0
119
Spread the love

వ్యవసాయ భూములున్న‌ గిరిజనులకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వండి – గ‌వ‌ర్న‌ర్‌

ఆదిమజాతి గిరిజనుల లో పోషకాహార స్థాయి లను పెంపొందించడానికి గవర్నర్ చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.
రాష్ట్రంలోని అదిలాబాద్ లోని కొల్లం తెగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్లు, నాగర్ కర్నూల్ జిల్లాలలోని చెంచు తెగలకు చెందిన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలు భాగస్వామ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపాయి.
రాజ్ భవన్ లో ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లతో, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, కాళోజీ వైద్య యూనివర్సిటీ, ఈ ఎస్ ఐ మెడికల్ కాలేజ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికై తీసుకోవలసిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. గతంలో రాజ్ భవన్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో ఆదిమజాతి గిరిజనులకు వ్యవసాయ భూములు, పశువులు, ఇతర వనరులు ఉన్నప్పటికీ వారు వారి భూముల్లోనే కూలీలుగా పని చేస్తున్న విషయం గమనించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ల సహకారంతో వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, వనరులు సమకూర్చి వారే సొంతంగా వ్యవసాయం, పశుపోషణ, పాడి అభివృద్ధి చేసుకునేలాగా తీర్చిదిద్దాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి హెల్త్ యూనివర్సిటీ, అలాగే ఈఎస్ఐ మెడికల్ కళాశాల బాధ్యత తీసుకోవాలని గవర్నర్ సూచించారు. వారిలో ఆరోగ్య స్థాయి, పోషణ స్థాయిలను పెంపొందించి నప్పుడు, ఇతర నైపుణ్య శిక్షణ లు ఇచ్చినప్పుడు, అవసరమైన ఇన్పుట్స్ సమకూర్చి నప్పుడు వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ,.సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారని గవర్నర్ వివరించారు.

ఈ కార్యక్రమాలు ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చోట్ల చేపట్టడానికి స్ఫూర్తిగా నిలవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ లు పాల్గొని తమ సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కరుణాకర్ రెడ్డి, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, సైంటిస్ట్ శ్రీనివాస్, ఈఎస్ఐ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మదన్ మోహన్ రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్రమోహన్ ఆదిమ తెగల గిరిజనుల కోసం గవర్నర్ చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారు. జాయింట్ సెక్రెటరీ జె భవాని శంకర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పుసుకుంట గిరిజన గ్రామంలో చేపట్టిన సర్వే ఫలితాలను వివరించారు.

StandByPVSunilKumarIPS || AP State Wide Protests

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here