మంత్రి ఈటలకు గవర్నర్ ఫోన్… ఎందుకంటే…?

0
119
Spread the love

మంత్రి ఈటలకు గవర్నర్ ఫోన్… ఎందుకంటే…?

తెలంగాణ లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటలకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన తమిళి సై… తెలంగాణ వైద్యారోగ్య శాఖ రూపొందించిన కొత్త యాప్ గురించి మంత్రి ని అడిగి తెలుసుకున్నారు. అయితే దాదాపు గత రెండు వారాల నుండి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కప్పుడు పదుల సంఖ్యలోకి వచ్చిన రోజువారీ కరోనా కేసులు ఇప్పుడు వెయ్యికి పైగా వస్తున్నాయి. దాంతో మళ్ళీ అందరూ తప్పకుండా కరోనా నియమాలు పాటించాలని.. అలాగే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here