వాననీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలి:  గవర్నర్

0
116
Spread the love

వాననీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలి:  గవర్నర్ తమిళిసై పిలుపు

హైదరాబాద్ జూలై 9 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ముందు ముందు రానున్న నీటి సంక్షోభాలను నివారించాలంటే వాన నీటిని ఒడిసి పట్టుకోవడం,   సంరక్షించుకోవడం ఒక ఉద్యమంలా చేపట్టాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.నేషనల్ వాటర్ మిషన్  చేపట్టిన “క్యాచ్ ద రైన్” అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గవర్నర్ తెలంగాణపుదుచ్చేరిలలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ లతోరెడ్ క్రాస్ ప్రతినిధులతో రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.ఒక వైపు వర్షాలు విస్తారంగా కురవడం, వాన నీరు వృధాగా పోవడం, మరోవైపు నీటి కొరత రావడం విచారకరమన్నారు.వర్షపు నీరును సంరక్షించుకోవడం వలన  తాగునీటి కొరతసాగునీటి కొరత అధిగమించవచ్చని గవర్నర్ తెలిపారు.ప్రపంచ జనాభాలో 18 శాతం మంది ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు, అలాగే  ప్రపంచంలోని దాదాపు  20 శాతం పశు సంపద  మనదేశంలోనే ఉందన్నారు.  కానీ భారతదేశంలో ప్రపంచంలోని మొత్తం నీటి వనరులలో కేవలం నాలుగు శాతం మాత్రమే దేశంలో ఉన్నాయి.కొన్ని వేల సంవత్సరాల కిందట ఏర్పడిన భూగర్భ జలాలను మనం ఇప్పుడు విచ్చలవిడిగా వినియోగిస్తున్నామనిదీనివల్ల భూగర్భ జలాలు మరింతగా తగ్గుతున్నాయి అన్నారు.వర్షపు నీరు సరైన సంరక్షణ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకమని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.దేశంలో 256 జిల్లాలు భూగర్భ జలాలను అధికంగా వినియోగించేక్లిష్ట దశకు చేరుకున్నాయని వివరించారు.భారతదేశంలో తలసరి నీటి వినియోగం పెరుగుతున్నది.  కానీ తలసరి నీటి లభ్యతలో భారతదేశం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నదని  వివరించారు.చెక్ డ్యాములు కట్టడంఇంకుడు గుంతలు నిర్మించడంరూఫ్ టాప్ వాన నీటి సంరక్షణ పద్ధతులు అవలంబించడంచెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా చూడడంపూడిక తీయడంస్టోరేజ్ కెపాసిటీ పెంచడంఫీడర్  ఛానల్ కాలువలలో అడ్డంకులు తొలగించడం వాన నీటి సంరక్షణలో అత్యంత కీలకమని గవర్నర్ వివరించారు.తెలంగాణ, పుదుచ్చేరిలలోని అన్ని యూనివర్సిటీలను హరిత క్యాంపస్లుగఅలాగే వర్షపు నీటి సంరక్షణ కేంద్రాలుగా  మార్చాలని గవర్నర్ వైస్ చాన్సలర్ లకు సూచించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాన నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి ఉద్యమ స్థాయిలో కృషి చేయాలని గవర్నర్ ఆదేశించారు.నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ జి. అశోక్ కుమార్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్  ద్వారా జాతీయస్థాయిలో “క్యాచ్ ద రైన్వెన్ ఇట్ ఫాల్స్, వేర్ ఇట్ ఫాల్స్” అనే  కార్యక్రమం ద్వారా జాతీయస్థాయిలో వాన నీటి సంరక్షణ పద్ధతులను పెంపొందించడానికి కృషి చెస్తున్నామని తెలిపారు.గవర్నర్ సెక్రెటరీ కె. సురేంద్రమోహన్ మాట్లాడుతూ రాజ్ భవన్ లో వాన నీటి సంరక్షణ పద్ధతులను, సోలార్ పవర్ జనరేషన్ పద్ధతులను వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణపుదుచ్చేరిలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్ లు తమతమ విశ్వవిద్యాలయాలలో చేపడుతున్న వాన నీటి సంరక్షణ పద్ధతులను వివరించారు.రాజ్ భవన్ ఉన్నతాధికారులునేషనల్ వాటర్ మిషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here