యువత వారి నైపుణ్యానికి పదును పెట్టాలి గవర్నర్ తమిళ సై
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యం లో ఆదివాసీ సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్
9th జనవరి,2022 – నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ తెలంగాణ శాఖ హైదరాబాద్ ఆధ్వర్యంలో 13వ ఆదివాసీ సమ్మేళనం ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ దేశంలోని యువతీ యువకులు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ మధ్యకాలంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారని చదువులో రాణిస్తున్నారని అని తెలిపారు, అంతేగాక అన్ని రంగాలలో యువత ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు, ఆర్థికంగా పారిశ్రామికంగా యువత తమదైన శైలిలో పని చేసి ప్రయత్నించాలని ఆమె వారిని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు రాష్ట్రాల నుండి ఐదు రాష్ట్రాలకు సంబంధించిన 220 మంది యువతీ యువకులు తెలంగాణ కు రావడం చాలా సంతోషకరమైన విషయం అని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు ఉపాధి అవకాశాలను మెరుగు పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ శ్రీమతి ఏఆర్ విజయ రావు అధ్యక్షత వహించారు.
శ్రీమతి కీర్తి ఐపీఎస్ ఇంటెలిజెన్స్ , శ్రీ తంగిరాల ఐ సి ఎం డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ ,కుమారి ఖుష్బూ ఆర్ వి కృష్ణారావు, చంద్రశేఖర్, బి రవీందర్ ,సునీల్, మధు కళ్యాణ్ ,బాలాజీ, ప్రీతి తదితరులు పాల్గొన్నారు