ఓటిటి, టీవీ ఛానళ్ల పోటీని తట్టుకుని చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుంది

0
305
Spread the love

ఓటిటి, టీవీ ఛానళ్ల పోటీని తట్టుకుని చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుంది : జిపి విజయకుమార్

ప్రపంచవ్యాపితంగా ప్రేక్షకులను పొందటానికి సగటు మరియు చిన్న బడ్జెట్ చిత్రాలకు ఓటిటి సహకరిస్తుంది ‘

వృత్తిపరమైన అంకితభావంతో సినిమాలు తీయడానికి ఎక్కువ మంది నిర్మాతలుముందుకు రావాలి ”

 

ఓటిటి, టీవీ ఛానళ్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుందని ప్రముఖ నిర్మాత మళయాళ చిత్రాల పంపిణీదారుడు జి పి విజయకుమార్ స్పష్టం చేశారు. గోవాలో జరుగుతున్న 51వ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనలో భాగంగా ‘ భారత చలన చిత్ర నిర్మాణంలో వస్తున్న మార్పులు’ అనే అంశంపై ఆయన ఈ రోజు ( జనవరి 20) ప్రసంగించారు.

“ఓటిటి తొలిసారిగా వచ్చినప్పుడు దానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓటిటి వల్ల సినిమా థియేటర్లలో సినిమాలు విడుదల కావని చలనచిత్ర వ్యాపారాలు మూతపడతాయని భావించారు. అయితే ఓటిటి, టీవీ ఛానళ్లు ప్రతి ప్రాంతంలో ఉన్నప్పటికీ సాంప్రదాయ చిత్ర పరిశ్రమ, థియేటర్లు మరియు బ్లాక్ బస్టర్ సినిమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఓటిటి, టీవీ ఛానళ్లు సినిమాకు ఆర్ధికంగా తోడ్పడతాయి. దీనితో ఇది మరింత లాభదాయకంగా మారుతుంది. ఓటిటిలో వీక్షకుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ 20 శాతం మించడం లేదు. ఓటిటిలో సగటు మరియు చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరవచ్చును. ఈ సౌకర్యం లేనప్పుడు ఇవి విడుదల కాకుండా డబ్బాలకు పరిమితమవుతాయి. అదే సమయంలో సృజనాత్మక చిత్రాలను నిర్మించేవారు తమ సినిమాలను థియేటర్లలో ప్రేక్షకులుచూడాలని కోరుకుంటారు.” అని విజయకుమార్ వ్యాఖ్యానించారు.

ఓటిటి ఇకపై కూడా ఉంటుందని స్పష్టం చేసిన విజయకుమార్ కోవిడ్ కష్టకాలంలో ఇది సినిమాలు విడుదల అయ్యేలా చూసి నిర్మాతలకు ఎంతో కొంత ఆదాయం లభించేలా చూసిందని అన్నారు.ఇటీవల కాలంలో సినిమాల విడుదల మరియు ప్రచార ఖర్చులు పెరిగాయి. ఉపగ్రహ మార్కెట్ పుంజుకోవడంతో ఉత్పత్తి వ్యయం 90 వ దశకంలో గణనీయంగా పెరిగింది, మల్టీప్లెక్సులు పెరిగాయి. ఇవన్నీ 2010 లో పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి అని అన్నారు.

ప్రేక్షకుల చలనచిత్ర వీక్షణ ప్రాధాన్యతలను ప్రస్తావించిన విజయకుమార్ “సినిమా చూసేవారి అభిరుచులు, ఎంపికలు గణనీయంగా మారాయి. వారు ఎంపిక చేసుకున్న వాటిని మాత్రమే చూస్తున్నారు. ప్రజలు వెబ్ సిరీస్ లను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యువతను చలనచిత్ర పరిశ్రమ లక్ష్యంగా చేసుకున్నది. తిరగడానికి ఇష్టపడే యువత యాప్ ల ద్వారాకొత్తగా విడుదల అయినవాటిలో తమకు నచ్చిన వాటిని చూస్తున్నారు. దీనికి భిన్నంగా ఇంటికి చేరిన తరువాత వృద్దులు టీవీలలో వచ్చే కార్యక్రమాలు సీరియళ్లను చూడడానికి ఇష్టపడుతున్నారు.’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here