Spread the love
*సురక్షిత ప్రయాణం కోసం సిగ్నల్స్ ఏర్పాటు*
*హైదరాబాద్, జూన్ 23:* హైదరాబాద్ మహానగరం దినదినాఅభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీ తో పాటు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా, సురక్షిత ప్రయాణం కోసం జిహెచ్ఎంసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నగర వ్యాప్తంగా అడాప్టెడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ATSC) సిస్టమ్ ద్వారా, పాదచారుల ప్రమాదాల నివారణకు పెలికాన్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు.
పోలీస్ శాఖ అధికారులు పోల్ మార్కింగ్ లొకేషన్ గుర్తింపు చేసి జిహెచ్ఎంసి కి సిపార్స్ చేస్తారు. వారి సూచన, ప్రతిపాదన మేరకు జిహెచ్ఎంసి సిగ్నల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడాప్టెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ (ATSC) ద్వారా 96 సిగ్నల్స్, పెలికాన్ సిస్టమ్ ద్వారా మరో 70 ఏర్పాటు కు ప్రతిపాదించారు. సిగ్నల్స్ ఏర్పాటు లో పోలీస్ శాఖ సూచించిన మేరకు ఫెసిబిలిటి నీ బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయుటకు జిహెచ్ఎంసి ప్రణాళిక సిద్ధం చేసింది.
జిహెచ్ఎంసి పరిధిలో వివిధ పద్ధతుల ద్వారా మొత్తం 384 సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యం కాగా అందులో htrims ద్వారా 234, ATSC పద్దతి ద్వారా 150 ఏర్పాటు కు ప్రతిపాదించగా వివిధ కారణలైన యూ టర్న్, ఫ్లై ఓవర్లు, సైట్ ఫెసిబిలిటి లేకపోవడం వలన 50 సిగ్నల్స్ ను తొలగించారు. మిగతా 334 లలో htrims 212, ATSC 122 ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో ప్రసుతం 199 htrims, 73 ATSC ద్వారా మొత్తం 179 సిగ్నల్స్ ఏర్పాటు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా 44 వివిధ ప్రగతి దశలో కలవు, మరో 18 లొకేషన్లను సంబంధిత శాఖ వారు నిర్ణయించాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న సిగ్నల్ ఏర్పాటు పూర్తయితే htrims సిస్టమ్ ద్వారా 212 సిగ్నల్స్ ATSC సిస్టమ్ ద్వారా 122 నగరంలో మొత్తం 334 సిగ్నల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
కారిడార్ లో నున్న సిగ్నల్స్ ను కేంద్రీకృతం గా నియంత్రించడం, ట్రాఫిక్ అనుగుణంగా సిగ్నల్ టైమింగ్ మార్చుకునే వెసులబాటు, ట్రాఫిక్ ను కెమెరాలో రికార్డు చేసే సెన్సార్ ఏర్పాటు, పవర్ బ్యాక్ అప్ కోసం సోలార్, బ్యాటరీ ఏర్పాటు, మెరుగైన ప్రయాణం, తక్కువ సమయం వెయిటింగ్ చేయడం, సిగ్నల్స్ వ్యవస్థ తో రోడ్డు భద్రత పెరుగుదల నగర ప్రజలకు సురక్షిత ప్రయాణానికి కృషి చేస్తున్నది.