భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ ?

0
144
COVISHILED VACCINE
Spread the love

పలు దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. కరోనా వైరస్‌ ఉధృతి మాత్రం తగ్గడం లేదు. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. కోవాక్స్‌ కూటమి భేటీ అయింది. వ్యాక్సినేషన్‌పై రెండు గంటలుగా చర్చిస్తోంది.ఈ వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్‌ను కూడా సమర్థంగా పనిచేస్తాయని ఆయా కంపెనీలు చెబుతున్న వేళ… కోవ్యాక్స్‌ కూటమి భేటీ కీలకంగా మారింది. ఈ భేటీలో ప్రధానంగా వ్యాక్సినేషన్‌పై చర్చిస్తోంది కోవ్యాక్స్ కూటమి. కరోనా న్యూ స్ట్రెయిన్‌పై.. ప్రస్తుతం సిద్ధమైన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అయితే భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ? ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశం? ఇవ్వచ్చని అంటున్నారు. భారత్‌ లో కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేసింది. ఇక కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఎదుర్కొనే సత్తా.. ఆస్ట్రాజెనికా టీకా ఉందని.. ఆ సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఆస్ట్రాజెనికా టీకా.. సాధారణ ధరల్లోనే అందుబాటులో ఉంటుందని చెబుతోంది. అటు, ఆక్స్‌ఫర్డ్ టీకా వైపు ప్రపంచ దేశాల దృష్టి సారించాయి. ఆస్ట్రాజెనికా టీకా 70 శాతం సమర్థత కలిగి ఉందని ఆక్స్‌ఫర్డ్ వెల్లడించగా.. క్రిటికల్ కండీషన్ కేసుల్లో 100 శాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనికా సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఎవరెన్ని చెప్పినా.. కోవ్యాక్స్‌ కూటమి ఏం తేల్చుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here