Spread the love
K_J_యేసుదాసు
ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్ లో క్లాసు చెబుతున్న టీచర్.., ప్రపంచంలో ఒక్క క్ర్రెస్తవులు మాత్రమే స్వర్గానికెళుతాడని భోదిస్తున్నారు. అది విన్న ఒక బాలుడు పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి “నాన్నా.. క్ర్రెస్తవులు మాత్రమే స్వర్గానికి కెళుతారంట కదా..?? నాకున్న స్నేహితులందరూ హిందువులే..మరి స్వర్గంలో ఎవరితో ఆడుకోవాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయి తల నిమురుతూ నువ్వు అన్ని మతాలనూ సమానంగా చూడు… అందరూ నీతో వుంటారన్నాడు.. తన తండ్రి మాట తూచా తప్పకుండా పాటించాడా కుర్రాడు..ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడన్న నారాయణ గురు భోదనతో ప్రభావితమై ఈనాటికి ఆ సిద్దాంతాలను పాటించడమే గాక ప్రజలను సైతం పాటల రూపంలో చైతన్య పరుస్తున్నాడు..అతడే అపర గాన గంధర్వుడు #కెజెయేసుదాసు.
భారతీయ సంగీత ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారుండరంటే అతియోక్తిలేదు. #1940_జనవరి_10 న ఒక పేద కుంటుంబంలో జన్మించారు. నాన్న అగస్టీన్ జోసఫ్, తల్లి ఆలిన్ కుట్టి.. అగస్టీన్ మంచి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు.. అందుకే దాసు గారి మొదటి గురువు ఆయనే..!! దాసు కంఠస్వరం చాలా గంభీరంగా విలక్షణంగా ఉండేది. ఆయన గొంతు విని అప్పటి గొప్ప సంగీత విద్వాంసులైన సెమ్మగుడి శ్రీనివాసన్ గారు. కె.ఆర్ కుమార్ స్వామి వంటి వారు తమ శిష్యునిగా చేసుకున్నారు. అయితే చెంబై వైద్ధ్యనాధన్ భాగవతార్ అనే గాయకుడు దాసు గారిని మంచి సంగీతకారుడిగా తీర్చిదిద్దారు.. తన శిష్యుని కోసం గురువాయూర్ దేవస్థాన కమిటీనే ధిక్కరించారు వైధ్యనాధన్ గారు..
అప్పట్లో కేరళలో ప్రతి గ్రామంలో దాసుగారి కచేరి జరిగిందట.. అయితే 1961 నవంబరు 14 ఒక మళయాళ సినిమాకు పాట పాడటం ద్వారా సినీరంగ ప్రవేశము చేసిన దాసు గారు ఇంక వెనుక తిరిగిచూడలేదు.. తెలుగులో అంతులేని కథ సినిమాలో పాడిన “దేవుడే ఇచ్చాడు..” పాటతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో ఆయనకు ఎదురులేకుండా పోయింది. బాలు లాంటి వారే మూడు సంవత్సరాలు ఇబ్బంది బడ్డారంటే ఆయన ప్రతిభ అర్థం చేసుకోవచ్చు.!!
1976లో హిందీలో రవీంద్ర జైన్ సంగీత సారథ్యంలో వచ్చిన చిత్ చోర్ సినిమా లో దాసుగారు పాడిన “గొరితెరా గావ్ బడా ప్యారా..మైతోగయా మారా ఆకే యహారే..” పాట భారత్ అంతా మారుమ్రోగింది.. దీనితో హిందీ గాయకులందరూ సంఘటితమై ఆయన చేత పాట పాడిస్తే మేము పాడమనే స్థాయికి వచ్చారు..!! రవీంద్రజైన్ గారు పుట్టుకతోనే అంధుడు. ఆయన ఏమనేవాడంటే దేవుడు ఒకసారి నాకు కనుచూపు ప్రసాదిస్తే యేసుదాసు రూపం చూసి తరిస్తాను”… ఇది చాలు దాసు గారి గొప్పదనం చెప్పడానికి..!!
క్ర్రెస్తవుడివై వుండి పరదేవుళ్ళను స్థుతిస్తూ పాటలు పాడినందుకు ఆ మతపెద్దలు ఆయనను వెలివేసినప్పుడు “నేను కళాకారుడను, నాకు అన్ని మతాలు అవసరమని బదులిచ్చాడు..!! 1971లో ఇండో-పాక్ యుద్దం అప్పుడు వీధి, వీధి తిరిగి సంగీత కచేరిలు చేసి వచ్చిన విరాళాలు ఇందిరాగాంధికి ఇచ్చిన దేశభక్తుడు..!!
మనదేశంలో ఒక్క కాశ్మీరి, అస్సామీ భాషలలో తప్ప మిగతా అన్ని భాషలలోనూ పాటలు పాడిన ఘనత ఈయన గారిదే..!! ఇవే కాకుండా మలేషియన్, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీషు భాషలలో సహితం పాటలు పాడి శ్రోతలను అలరించారు.. కొన్ని పాటలు #యేసుదాసు కంఠంతోనే వినాలనిపించేంతగా ప్రజలు విశ్వసిస్తారంటే అతిశయోక్తి కాదు..!! ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన పాడిన హరివరాసనం అనే పాట అయ్యప్పస్వామిని నిద్రపుచ్చే పాటగా ట్రావెన్కోర్ దేవస్థానం తీసుకుంది.. అలాగే మేలుకొలుపు పాట ఆయనదే..!! ఇప్పటి వరకు 40000 పాటలు పాడారాయన..!!
ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ..ఆయనకు మంచి ఆరోగ్యము, ప్రశాంత జీవనమును దేవుడు ప్రసాదించాలని కోరుకుందాము..!! 💐🌹🌺
స్వరరాగ గంగా ప్రవాహమే….