సీఎం ఊహించిన విధంగానే ఎమ్మెల్సీ ఫ‌లితాలు – హ‌రీశ్ రావు

0
48
Spread the love

సీఎం ఊహించిన విధంగానే ఎమ్మెల్సీ ఫ‌లితాలు
– ప‌నిచేయని కాంగ్రెస్ జిమిక్కులు, ప్ర‌లోభాలు
– మెద‌క్ అభ్య‌ర్ధిని 762 ఓట్ల‌తో గెలిపించిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ధ‌న్య‌వాదాలు
– రైతుల గురించి మాట్లాడే హ‌క్కు కాంగ్రెస్ కు లేదు
– మెద‌క్, సంగారెడ్డిల్లో 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
– వ్య‌వ‌సాయంపై అధికంగా ఖ‌ర్చు చేస్తున్న‌ రాష్ట్రం తెలంగాణే
– ఏ రాష్ట్రంలో లేని విధంగా బ‌డ్జెట్‌లో 13.5 శాతం ఖ‌ర్చు చేస్తున్నాం
– స్థానిక సంస్థ‌లను బీజేపీ నిర్వీర్యం చేసింది
– ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు
– మంత్రిని క‌లిసిన గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ రెడ్డి, మెద‌క్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు
———————————————–

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కె చంద్ర‌శేఖ‌ర్ రావు గారు ఊహించే జ‌రిగింద‌ని, అన్ని సీట్ల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకొని ఘ‌న విజ‌యం సాధించింద‌ని ఆర్థిక, వైద్యారోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయ‌కులు ఎన్ని జిమిక్కులు చేసినా ఎన్ని ర‌కాలుగా మ‌భ్య పెట్టినా, ప్ర‌లోభాల‌కు గురికాకుండా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ఎస్ వెంట న‌డిచార‌న్నారు. మెద‌క్ ఎమ్మెల్సీ స్థానం గెలుపొందిన నేప‌థ్యంలో ఎమ్మెల్సీ గా గెలిచిన యాదవ రెడ్డి, ఎమ్మెల్యేలు ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్ఎల్‌సీ ఫారూక్ హుస్సేన్ , ఎఫ్.డీ.సీ చైర్మ‌న్ ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మ‌న్ శివ‌కుమార్, గ‌జ్వేల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బ‌క్కి వెంక‌ట‌య్య‌, గ‌జ్వేల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కౌన్సిల‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు మంగ‌ళ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మెద‌క్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధికి 754 , అద‌నంగా మ‌రో 8 ఓట్లు క‌లుపుకొని మొత్తం 762 ఓట్లు సాధించామ‌న్నారు. ముఖ్య‌మంత్రి గారి నిర్ణ‌యం మేర‌కు ఏక‌తాటిపై నిలిచి అద్భుత విజ‌యం సాధించేందుకు కృషి చేసిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. గెలుపొందిన అభ్య‌ర్ధి యాద‌వ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ గెలుపునకు దోహ‌దం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రైతుల పేరిట కొత్త నాట‌కాల‌కు తెర‌తీసింద‌న్నారు. వ్య‌వ‌సాయం, రైతుల గురించి మాట్లాడే హ‌క్కు కాంగ్రెస్ కు ఎక్క‌డిద‌ని మంత్రి హరీష్ రావు ప్ర‌శ్నించారు. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఒక్క నాడు కూడా రైతుల సంక్షేమం గురించి ఆలోచించ‌లేద‌న్నారు. నాణ్య‌మైన ఉచిత క‌రెంట్, ఎరువులు, విత్త‌నాలు ఇవ్వ‌ని కాంగ్రెస్ పార్టీ రైతుల మీద మొస‌లి క‌న్నీరు కార్చుతున్నదని మంత్రి మండిప‌డ్డారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో నీలం తుఫాన్ వ‌స్తే సీఎం గా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వ‌లేద‌న్నారు. అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు అప్ప‌ట్లో నోరు మెద‌ప‌లేద‌ని గుర్తు చేశారు. దేశంలో 24 గంట‌ల క‌రెంట్ ను ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. దీని కోసం ప్ర‌తీ ఏడాది 10,500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. రూ.14,500 కోట్లు రైతు బంధు మీద, రూ. 1400 కోట్లు రైతు బీమా మీద ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. దేశ వ్యాప్తంగా రైతుబీమా పేరిట రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైన ప్ర‌భుత్వం తెలంగాణ‌నే అని కొనియాడారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతు రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఆ రాష్ట్ర రైతుల‌కు మొండి చెయ్యి చూపించింద‌న్నారు.

వ‌డ్ల కొనుగోళ్లు స‌జావుగా సాగుతున్నాయ‌న్నారు. అకాల వ‌ర్షాల‌తో కొన్ని చోట్ల ధాన్యం త‌డిస్తే దాన్ని రాజ‌కీయం చేయాల‌ని కాంగ్రెస్ చూస్తుంద‌న్నారు. సంగారెడ్డి, మెద‌క్ లో ఇప్ప‌టికే 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్త‌యింద‌న్నారు. ప్ర‌జాప్ర‌తిధుల‌తో రాజ‌కీయం చేయాల‌ని కాంగ్రెస్ చూసింద‌ని, కానీ టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు బుద్ధి చెప్పార‌న్నారు. ఎంపీటీసీ, జెడ్పీ టీసీ వేత‌నాలు పెంచింది టీఆర్ఎస్ పార్టీనే న‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక నిధులు ఇస్తున్నామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల‌కు 15 ఆర్ధిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల‌ను బీజేపీ త‌గ్గిస్తే, దాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంత‌కు స‌మాన‌మైన నిధుల‌ను క‌లిపి ఆ మొత్తాన్ని గ్రామ పంచాయితీల‌కు అంద‌జేస్తున్న‌ద‌ని చెప్పారు. మండ‌ల ప‌రిష‌త్, జిల్లా ప‌రిష‌త్ ల‌కు రూ. 500 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఇచ్చింద‌న్నారు. కానీ కేంద్రం మాత్రం అంద‌జేసే నిధులు త‌గ్గించి మండ‌ల ప‌రిష‌త్ జేడ్పీల‌ను బీజేపీ నిర్వీర్యం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల‌ మీద బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ అగ్ర‌గామీగా నిలుస్తోంద‌న్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ 13.5 శాతం ఖ‌ర్చు చేస్తుండ‌గా, ప్ర‌ధాని సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ కేవ‌లం 4.40 శాతం, బీహార్ 3.7 శాతం, యూపీ 2.7 శాతాల చొప్పున ఖ‌ర్చు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌సాయం మీద ప్ర‌భుత్వం రూ. 91,520 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, రైతుల‌కు ఉచిత విద్యుత్ కింద రూ. 44,399 కోట్లు ఖ‌ర్చు చేసింద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here