క‌రోనాపై మంత్రి హరీష్ రావు స‌మీక్ష

0
102
Spread the love

క‌రోనాపై మంత్రి హరీష్ రావు స‌మీక్ష

హైద‌రాబాద్ మే 18 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో క‌రోనాపై మంత్రి హరీష్ రావు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ‌ అధికారులు హాజ‌ర‌య్యారు. కొవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఔష‌ధాల‌పై చ‌ర్చిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు. ఈ భేటీ కంటే ముందు మంత్రి హ‌రీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని బ్లాక్ ఫంగ‌స్‌కు నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here