బిజెపి నాయకులకు ఒక శాపం ఉందంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేసిన హ‌రీష్‌రావు

0
33
Spread the love

సిద్దిపేట జిల్లా; బిజెపి నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు. అని విమ‌ర్శించారు మంత్రి హ‌రీష్ రావు. సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో సిద్దిపేట పట్టణ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరిష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు నిన్న పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు. అని ఎద్దేవ చేశారు.

బిజెపి మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని ఆరోపించారు. కేంద్ర బిజెపిలో ఆధిపత్య పోరు కూడా ఉంద‌ని, గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నార‌ని తెలిపారు. బిజెపిది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పాట పాడుతోంద‌ని విమ‌ర్శించారు. అదే విధంగా రాహుల్ గాంధీ పై మండి పడ్డ హరీష్. రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇస్తారో అర్థం కావడం లేద్నారు. ఆయ‌న చెప్పే ప‌థ‌కాలు రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో అమలు అవుతున్నాయా ? ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్థుడు రాహుల్ గాంధీ. అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రంలోని బీజేపీ పై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అని దుయ్య‌బ‌ట్టారు. పదవులు వచ్చిన వారు ప్రజల కోసం పని చేయాలి. ప్రజలకు, ప్రభుత్వాని కి మధ్య వారదులుగా కార్యకర్తలు ఉండాలని సూచించారు. క్యాడర్ లేకుంటే పార్టీ లేదు.. కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలు అని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here