రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వానలు

0
75
Spread the love

గత కొన్ని రోజులుగా భాణుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25 వరకు దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వెల్లడింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా వాన కురింది. ఇప్పటికే నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here