భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోను : స్ప‌ష్టం చేసిన  ర‌జ‌నీకాంత్

0
38
Spread the love

భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోను : స్ప‌ష్టం చేసిన  ర‌జ‌నీకాంత్

చెన్నై జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని ప్రముఖ సిని నటుడు   ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు అలాంటి ఉద్దేశం లేద‌న్నారు. మ‌క్క‌ల్ మండ్రంను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తలైవా ప్ర‌క‌టించారు. 70 ఏళ్ల ర‌జ‌నీకాంత్ గ‌త ఏడాది రాజ‌కీయ పార్టీ ఆవిష్క‌రించే దిశ‌గా అడుగులు వేశారు. ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు గ‌త ఏడాది చెప్పిన త‌లైవా.. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయ్యారు. పొలిటిక‌ల్ పార్టీ స్టార్ట్ చేయ‌డం లేద‌ని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా చికిత్స‌ త‌ర్వాత అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ మ‌ళ్లీ ఇటీవ‌ల చెన్నై చేరుకున్నారు. రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ర‌జ‌నీకాంత్ ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here