ఓటుకు నోటు కేసు.. హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

0
78
Spread the love

ఓటుకు నోటు కేసు.. హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

హైదరాబాద్‌ జూన్ 1 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్‌ రేవంత్‌రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here