సర్కార్ ఉదాసీన వైఖరిని తప్పు పట్టిన హైకోర్టు

0
109
Spread the love

సర్కార్ ఉదాసీన వైఖరిని తప్పు పట్టిన హైకోర్టు

హైదరాబాద్ ఏప్రిల్ 6 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమవుతోందని ఆక్షేపించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న దృష్ట్యా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది.కరోనా వైరస్ టెస్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. పాఠశాలలు కళాశాలలను మూసివేసినప్పుడు బార్లు పబ్బులు రెస్టారెంట్లు మరియు థియేటర్లను పూర్తిస్థాయిలో నడపడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందని కోర్టు ప్రశ్నించింది. మొత్తం పరీక్షలలో 10 శాతం కూడా లేని ఆర్టీపీసీఆర్ పరీక్షలకు బదులుగా రాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. వివాహాలు అంత్యక్రియల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని.. రద్దీ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here