అసోం 15వ ముఖ్యమంత్రి గా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం

0
184
Spread the love

అసోం 15వ ముఖ్యమంత్రి గా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం

గోహతి మే 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: అసోం 15వ ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ జగదీశ్‌ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, త్రిపుర సీఎం బిప్లబ్​ దేబ్​, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్‌ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్​, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. 126 స్థానాలు అసోం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 60, ఏజీపీ, తొమ్మిది, యూపీపీఎల్‌ ఆరు స్థానాల్లో గెలుపొందాయి. ఆదివారం జరిగిన బీజేపీ సమావేశంలో శాసనసభా పక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here