క‌రోనా కేసులు పెరుగుతున్నా…. హోలీ వేడుక‌ల‌కు ఈవెంట్ల బుకింగ్‌లు  క‌ట్ట‌డి చేయాలంటున్న ప‌రిశీల‌కులు

0
183
Spread the love

        క‌రోనా కేసులు పెరుగుతున్నా….
హోలీ వేడుక‌ల‌కు ఈవెంట్ల బుకింగ్‌లు
 క‌ట్ట‌డి చేయాలంటున్న ప‌రిశీల‌కులు

హోలీ అంటే చాలు.. అంతా ఓ చోట చేరి రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ రెండ‌వ సారి ఎక్క‌వైతున్న నేపథ్యంలో ఈ పండుగ జరుపుకోవాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం క‌రోనా అంశాన్నే ప‌ట్టించుకోవ‌డం లేదు. రానున్న హోలీ సంబురాల‌ను జ‌రుపుకునేందుకు చాలా మంది ఈవెంట్లు ప్లాన్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ర‌క‌ర‌కాల రిసార్టులు…. ప్లేగ్రౌండ్లు… ఉద్యాన‌వాన‌ల్లో హోలీ సంబురాలు నిర్వ‌హించుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు క‌రోనా విస్త‌రిస్తున్నా కొంద‌రు హోలీ వేడుక‌లు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కొంద‌రు ఇప్ప‌టికే గ్రౌండ్లు బుక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా హోలీ సంబురాల‌ను ఉత్త‌రాది వారు బాగా ఎక్క‌వ‌గా చేసుకుంటారు. వీరు ప్ర‌ధానంగా అంద‌రూ క‌లిసి ఒక్క‌చోటికి చేరుకొని వేడుక‌లు చేసుకుంటారు. రంగులు… నీటితో ఈ సంబురాలు ఉంటాయి. ఇలాంటి ఒక్క‌చోటి ఉండి చేసుకుంటే…. క‌రోనా విజృంభించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ద‌క్షిణ భార‌త దేశంలో హైదరాబాద్‌లో ఎక్కువ హోలీ వేడుక‌లు జ‌రుగుతాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రధాన ప్రాంతాల్లో ఈ వేడుక‌లు నిర్వ‌హించుకునేందుకు చాలా మంది ఈవెంట్లు బుక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రి క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌రి పోలీసులు ఇలాంటి వేడుక‌ల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తారో చూడాలి. ఒక్క‌చోట గూమిగూడి హోలీ నిర్వ‌హించుకోవ‌డం క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌మాదమ‌ని వీటిని సీఎం కెసీఆర్‌తో పాటు పోలీసులు నిలువ‌రించాల‌ని ఆరోగ్య‌…ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌లు విన‌తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here