మ‌ధ్యాహ్నం 12 నుంచి సా. 4 గంట‌ల మ‌ధ్య బ‌య‌ట‌కు రావొద్దు..

0
48
Spread the love

మ‌ధ్యాహ్నం 12 నుంచి సా. 4 గంట‌ల మ‌ధ్య బ‌య‌ట‌కు రావొద్దు.. రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు సూచించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌స్తే గొడుగు ఉప‌యోగించాల‌న్నారు. లేదా త‌ల‌కు ఏదైనా బ‌ట్ట చుట్టుకోవాల‌ని సూచించారు. న‌లుపు రంగు దుస్తులు ధ‌రించ‌కుండా, లేత రంగు దుస్తులు, కాట‌న్ వ‌స్త్రాలు ధ‌రించాల‌ని చెప్పారు. రోజుకు 4 లీట‌ర్ల నీళ్లు తాగాలి..
ఎండా కాలంలో డీ హైడ్రేష‌న్ జ‌ర‌గ‌డం సాధార‌ణమ‌ని డీహెచ్ పేర్కొన్నారు. అయితే ప్ర‌తి రోజు 2.5 లీట‌ర్ల నుంచి 4 లీట‌ర్ల నీళ్లు తాగాలి. మ‌ద్యపానం వ‌ల్ల డీ హైడ్రేష‌న్ అధికంగా జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌జ్జిగ‌, కొబ్బ‌రినీళ్లు త‌రుచుగా తీసుకోవ‌డం మంచిది. మ‌సాలాలు, వేపుళ్లు త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు అని శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు.

 

వ‌డ‌దెబ్బ ల‌క్ష‌ణాలు ఇవే..
వ‌డ‌దెబ్బ త‌గిలిందంటే చెమ‌ట ప‌ట్ట‌దు.. నాలుక‌, పెదాలు ఎండిపోతుంటాయి. బాగా నీర‌సంగా అయిపోతారు. హార్ట్ బీట్ అధికంగా ఉంటుంది. క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప్రాణాల‌కు ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో ఉండాలి. వ‌డ‌దెబ్బ త‌గిలింద‌ని ఒకేసారి లీట‌ర్ల కొద్ది నీళ్లు తాగొద్దు. నెమ్మ‌దిగా నీళ్లు తీసుకోవాలి. గాలి, వెలుతురు త‌గిలేలా చూసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని డీహెచ్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here