హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల స‌మాచారం

0
428
Spread the love
హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల స‌మాచారం
* 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు
* 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో 40,57,488 మంది ఓట‌ర్లు
* పురుష ఓట‌ర్లు 21,10,364మంది, మ‌హిళా ఓట‌ర్లు 19,46,780మంది, ఇత‌రులు 344 ఓట‌ర్లు ఉన్నారు.
* 313 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు.
* 3,873 పోలింగ్ కేంద్రాలు
* 4,468 కంట్రోల్ యూనిట్లు, 8,574 బ్యాలెట్ యూనిట్లు, 4,861 వివిప్యాట్‌ల వినియోగం.
* హైద‌రాబాద్ జిల్లాలో 1,404 క్రిటిక‌ల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తింపు.
* 532 క్రిటిక‌ల్ పోలింగ్ లొకేష‌న్లు, 17 అత్యంత స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాలు
* క్రిటిక‌ల్ పోలింగ్ లొకేష‌న్ల బ‌య‌ట సిసి కెమెరాల ఏర్పాటు.
* అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వ‌హ‌ణ‌
* ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు 3,873 ప్రిసైడింగ్ అధికారులు, 11,619 పోలింగ్ అధికారులు, 661 మైక్రో అబ్స‌ర్‌వ‌ర్ల నియామ‌కం.
* అందుబాటులో 20శాతం మంది అద‌న‌పు సిబ్బంది.
* అన్ని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ర్యాంప్‌ల నిర్వ‌హ‌ణ‌, టాయిలెట్‌, త్రాగునీటి సౌక‌ర్యాల ఏర్పాటు.
* హైద‌రాబాద్‌లోని ఓట‌ర్లుగా ఉన్న 18,042 మంది వికలాంగ ఓట‌ర్ల‌ను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు.
* విక‌లాంగులు, వృద్దులకై ప్ర‌త్యేకంగా 125 వాహ‌నాలతో ఉచిత ర‌వాణా సౌక‌ర్యం.
* ప్ర‌తి వాహ‌నం వెంట ప్ర‌త్యేక వాలెంటీర్ల నియామకం.
* హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట్‌, నాంప‌ల్లి, కార్వాన్‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, యాక‌త్‌పుర‌, బ‌హ‌దూర్‌పుర నియోజ‌క‌వ‌ర్గాల్లో రోహింగ్యాలు ఓటు వేయ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు.
* హైద‌రాబాద్‌లో ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల పంపిణీ పూర్తి.
* ఓట్ల ప్ర‌క్రియ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
* కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల ప‌ర్య‌వేక్ష‌ణ‌.
* ఓట‌రు న‌మోదు శాతం పెంచ‌డానికి విస్తృతంగా చైత‌న్య‌, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన జీహెచ్ఎంసి.
* మైజీహెచ్ఎంసీ యాప్‌, నా ఓటు, వాదా యాప్‌ల ద్వారా ఓట‌ర్లు త‌మ పోలింగ్ కేంద్రాన్ని సుల‌భంగా గుర్తింపు సౌక‌ర్యం.
*ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియమావ‌ళి ప‌టిష్టంగా అమ‌లుకు ప‌టిష్ట చ‌ర్య‌లు.
* ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు నోడ‌ల్ అధికారులుగా జీహెచ్ఎంసీ ఉన్న‌తాధికారుల నియామ‌కం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here