విద్యార్థుల చే మువ్వెన్నెల ప్రదర్శన

0
75
Spread the love

విద్యార్థుల చే మువ్వెన్నెల ప్రదర్శన

హైదరాబాద్, ఆగస్టు 10: 
  స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్.బి.టి నగర్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్వర్యంలో బుధవారం మువ్వన్నెల జెండా ప్రదర్శన పెద్ద ఎత్తున చేపట్టారు.  జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో వజ్రోత్సవ స్ఫూర్తి, జాతీయ జెండా యొక్క గౌరవాన్ని కాపాడుతూ ప్రదర్శన గావించారు. స్వాతంత్య్ర సాధన, జెండా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా విద్యార్థుల ర్యాలీ అందరినీ ఆకట్టు కుంది. స్వతంత్ర భారత  వజ్రొత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్ననేపథ్యంలో ప్రజలకు పూర్తి స్థాయిలో చైతన్యం కల్పించే విధంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. మువ్వన్నెల రెపె రెప ప్రదర్శన అందరినీ ఆకట్టకుంటున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here