సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి …8 మంది అరెస్ట్

0
668
Spread the love

సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి …8 మంది అరెస్ట్‌

హైద‌రాబాద్‌లో ఎంతో ఫేమ‌స్ అయిన అబిద్స్‌లోని సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల రైడ్‌‌లో లో గాంబ్లింగ్‌కు పాల్ప‌డుతున్న‌ ఎనిమిది మందిని ప‌ట్టుకున్నారు. ఇందులో సంతోష్ దాబాతో పాటు మ‌యూర్ పాన్ షాప్ నిర్వా‌హ‌కుడు కూడా అరెస్టు అయిన‌ట్లు తెలుస్తోంది. గాంబ్లింగ్ నిర్వాహ‌కుడు బేగంబ‌జార్ నివాసి స‌త్యప్ర‌కాష్(సంతోష్ దాబా)‌, బ‌హ‌ద్దూర్‌పురాకు చెందిన నౌషాద్ అలీ, ఓల్డ్ తోప్‌ఖానాకు చెందిన పుష్ప‌క్ జైన్‌, గ్యాన్ బాగ్ కు చెందిన రాజ్‌కుమార్‌, రాంకోట్‌ కు చెందిన అలోక్ జైన్‌, బ‌ర్క‌త్ పుర నివాసి పురుషోత్తం‌ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి రూ.73,860 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. వీరు నిరంత‌రం గాంబ్లింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు స‌మాచారం ఉంది. నాలుగు నెల‌లుగా స‌రైన స‌మ‌యం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.  విశ్వ‌న‌సీయ స‌మాచారంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే కేసు నుంచి త‌ప్పించుకునేందుకు నిందితులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం. పోలీసులు మాత్రం వీరిపై కేసు న‌మోదు చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. 

అధికారులు పంపించిన పొటోలో 8 మంది ఉంటే… మీడియాకు తెలిపిన వివ‌రాలు మాత్రం కేవ‌లం 7 మందివే. ఇందులో కొంద‌రిని.. ఉద‌య‌మే విడుద‌ల చేసిన పోలీసులు…. మిగ‌తా వారిని సాయంత్రం విడుద‌ల చేశారు. పోలీసులు ల‌క్ష‌ల్లో న‌గ‌దు స్వాధీనం చేసుకొని కేవ‌లం కొంత‌నే చూపిస్తున్నార‌ని భోగ‌ట్టా.

Read This News Also

హైదారాబాద్ టు గోవా స్థాయిలో న‌గ‌రంలో గాంబ్లింగ్‌ సంతోష్ దాబాపై పోలీసుల దాడితో బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here