చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి

0
58
Spread the love
 
చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి


TOOFAN – హైదరాబాద్, ఏప్రిల్ 18:
   హైదరాబాద్ పాత బస్తీలో నిజాం కాలంలో చారిత్రక కట్టడాలు భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఆ ప్రాంతం  చారిత్రాత్మక కట్టడాల పునరుద్దరణ, ఇన్నోవేషన్  చేసి పాత వైభవన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 90  .45కోట్ల వ్యయంతో 5 పనులకు నిధులు మంజూరు చేశారు. జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, కులి కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అట్టి  పనులను హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చేపట్టనున్నారు. పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రులతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం నాడు  చారిత్రాత్మక కట్టడాల నిర్మాణం పనులకు, రిహబిటేశన్ ఆఫ్  సేవెరేజ్ నెట్వర్క్  శంకుస్థాపన ల తో పాటు  బహదూర్ పుర ఫ్లైఓవర్ ను కూడ మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారు.
 
 
 
రూ495.75కోట్ల విలువైన 6 వివిధ రకాల  పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు


రూ. 2.కోట్ల 55 లక్షల వ్యయంతో మీర్ ఆలాం చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.  108 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన బహదూర్ పుర ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. చార్మినార్ వద్ద మహబూబ్ చౌక్ (ముర్గి చౌక్)  పునరుద్దరణ  పనులను, రూ. 36 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ. 21.90 కోట్ల అంచనా వ్యయంతో చార్మినార్ జోన్ లో గల  మీర్ ఆలాం మండి రివ్యంపింగ్ (Revamping) రిజువనేషన్ (Rejuvenation)  పనులకు, సర్దార్ మహల్ అభివృద్ధికి రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన అంతేకాకుండా కర్వన్ అసెంబ్లీ నియోజక వర్గం లో  హెచ్ ఏం డబ్లు యస్ యస్ బి ద్వారా 297.30 కోట్ల అంచనా వ్యయం తో  జోన్ 3 లో  రిహబిటేషన్ ఆఫ్ సేవటేజ్  నెట్ వర్క్  చేపట్టే  పనికి  మంత్రి కేటిఆర్ చేస్తారు..
  
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here