నేను ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ పోలీసుల‌ను అస్స‌లు న‌మ్మ‌ను – అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0
175
Spread the love

నేను ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ పోలీసుల‌ను అస్స‌లు న‌మ్మ‌ను – అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్వాతంత్య్ర దినోత్స‌వాలు స‌మీపిస్తున్న వేళ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న‌లు చేశారు ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌. తాను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని, ఉత్తరప్రదేశ్ పోలీసులను అస్సలు నమ్మడం లేదని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్ర‌క‌ట‌న చేశారు. స్వాతంత్య్ర‌ దినోత్సవానికి ముందు లక్నోలో వరుస పేలుళ్లకు ప్రణాళికలు చేస్తున్న‌ అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న ఇద్ద‌రు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అఖిలేష్ యాద‌వ్ చేసిన ఈ ప్రకటనను సమర్థిస్తూ సమాజ్ వాదీ పార్టీ ప్రతినిధి అనురాగ్ భదౌరియా ఓ జాతీయ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ…. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ‘జంగిల్ రాజ్’ పరిధిలో ఉందని పేర్కొర్నారు. యుపి పోలీసు సిబ్బంది ప్రజల కోసం పనిచేయదు…. వారు ఎల్ల‌ప్పుడు క‌షాయ పార్టీ కోసం పనిచేస్తారని ఆరోపించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర పంచాయతీ ఎన్నికల సందర్భంగా యుపి పోలీసులు ప్రవర్తించిన తీరు ఆక్షేప‌నీయ‌మ‌న్నారు. పోలీసుల తీరు స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేయక‌పోగా.. ప్ర‌జ‌లు త‌మ‌ పోరాటాలను ఉదృతం చేసేలా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా యుపి పోలీసు సిబ్బంది ప్రవర్తన చాలా ఘోరంగా ఉందని …పోలీసులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన పార్టీ సభ్యులు, కార్యకర్తలపై పలు తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశార‌ని దుయ్య‌ట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా చూడటం యుపి పోలీసుల ఏకైక లక్ష్యంగా మారిపోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేవారు.

పోలీసుల‌పై వ్యాఖ్య‌లను ఖండించిన‌ యూపీ మాజీ డీజీపీ

రాష్ట్ర పోలీసులపై మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ చేసిన వ్యాఖ్యల‌ను ఉత్తర ప్రదేశ్ మాజీ డిజి విక్రమ్ సింగ్ ఖండించారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాల‌ను చేయ‌డం మానుకోవాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా హిత‌వు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖ తనకు అందించిన అన్ని సెక్యూరిటీలను మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ఉప‌సంహ‌రించుకుని ఉంటే… ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను నేను ఖచ్చితంగా నమ్ముతానని ఎద్దేవ చేశారు. ఇప్ప‌టికైనా ఆయ‌న ద్వంద‌వైఖ‌రిని విడ‌నాడాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here