10వ, ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు

0
121
Spread the love

10వ, ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు
(TOOFAN – Hyderabad)

అక్టోబర్ 29,30,31 తేదీల్లో చెన్నైలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ 10వ, ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను సోమవారం నాడు ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్.ఎన్.సిన్హాలు సమీక్షించారు. 

ఈ ప్లీనరీకి అతిథ్యమిస్తున్న తమిళనాడు జర్నలిస్ట్స్ యూనియన్(టీజేయు) రాష్ట్ర అధ్యక్షులు డి.ఎస్.ఆర్ సుభాష్, ప్రధాన కార్యదర్శి రమేష్, పాండిచ్ఛేరి రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు మదిమహారాజతో పాటు ఆ రాష్ట్ర యూనియన్ ప్రధాన బాధ్యులు హాజరై ఏర్పాట్లను వివరించారు. ప్లీనరీలో దేశంలోని దాదాపు 25 రాష్ట్రాల నుండి కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నందున వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రతినిధులకు వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే పబ్లిసిటీ, సభాస్థలి, అతిథులు తదితర ఏర్పాట్లను నిర్వాహకులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here