బల్దియా కార్మికులకు ఇమ్మ్యూనిటీ కిట్ ల పంపిణి

0
106
Spread the love

బల్దియా కార్మికులకు ఇమ్మ్యూనిటీ కిట్ లను పంపిణి చేసిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్, మే 31 :: కరోనా మహమ్మారి కట్టడికి ఫ్రాన్స్ లైన్ వారియర్ గా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఇమ్మ్యూనిటీ మెడికల్ కిట్ లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అందచేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ దాదాపు ఐదు వందల మందికి ఈ ఇమ్మ్యూనిటీ పెంపు మెడికల్ కిట్లను సోమవారం నాడు అందచేశారు. ప్రాజెక్ట్ హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో అందచేసిన ఈ మెడికల్ కిట్ లలో విటమిన్ టాబ్లెట్ లు , డీ.విటమిన్ టాబిలెట్లు, జింక్ టాబ్లెట్ లు, పారాసిటమాల్ , హ్యాండ్ శానిటైసర్, మాస్కులున్నాయి. గ్రేటర్ మునిస్పల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత నిస్త్తున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే, దాదాపు 95 శాతం శానిటేషన్ సిబ్బందికి వాక్సినేషన్ పూర్తిచేశామని అన్నారు. సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ గొలుసులను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ సంతోష్ బాదావత్, సి.ఎం.హెచ్.ఓ అరుణ, హోప్ ప్రాజెక్ట్ ప్రతినిధులు సామ్యూల్ పట్టా, మెర్లిన్,స్టీవెన్,  సద్గుణ బాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here