20 తర్వాత లాక్‎డౌన్ ఎత్తివేసే అవకాశాలు?

0
68
Spread the love

20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు?

హైదరాబాద్ (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కరోనా వైరస్ దేశాన్నే కాదు..రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసింది. కరోనా కట్టడి కాకపోవడంతో పలు రాష్ట్రాలు స్వచ్ఛందగా లాక్డౌన్ను అమలు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 19తో లాక్డౌన్ ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది. ఈ నెల 19 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ తరహా అన్లాక్కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36శాతానికి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ప్రభుత్వం అన్లాక్ చేసే విధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 19 తర్వాత నైట్ కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here