ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ముగిసిన ఐటీ దాడులు

0
277
Spread the love

ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ముగిసిన ఐటీ దాడులు

తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ ఇంటిపై ఆదాయ ప‌న్ను శాఖ దాడులు ముగిసాయి. ఈ త‌నిఖీల్లో అధికారులు రూ.3.53 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. ఆయ‌న పేరిట 14 బ్యాంకు ఖాతాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ నెల 12వ తేదీ హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ర‌మేష్ ఇంటిలోకి ప్ర‌వేశించిన ఐటీ అధికారులు శ‌నివారం అర్థ‌రాత్రి వ‌ర‌కు దాడులు కొన‌సాగించారు. ఆయ‌న ఇంట్లో అనేక లాక‌ర్లు ఉండ‌డం వారు గ‌మ‌నించారు. అవి కేవ‌లం ర‌మేష్ వేలిముద్ర‌ల ద్వారానే తెరుచుకుంటాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెల‌ప‌డంతో దేశ రాజ‌ధానిలో ఉన్న ఆయ‌న‌ను అదికారులు ర‌ప్పించారు. ఆయ‌న సంబంధించిన కంపెనీల్లో కూడా సోదాలు జ‌రిగాయి. అధికారులు కొ్ని హార్డ్ డిస్క్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ముగిసిన తర్వాత పంచ‌నామాలు అందుకున్న ర‌మేష్ మీడియాతో మట్లాడారు. త‌న‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసేందుకే సోదాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here