కొత్త పార్లమెంటు భవన నిర్మాణం కొన్ని నిజాలు….

0
310
Spread the love

కొత్త పార్లమెంటు భవన నిర్మాణం కొన్ని నిజాలు….

యూనిటీ స్టాట్యూ నిర్మాణం అనగానే దేశంలోని కాంగియులు, అర్బన్ నక్సల్ వాదులు, jnu తుకడేలు, లుచ్చరికం గాళ్ళు పెట్రేగి పోయారు. ఐనా నిర్మాణం ఆగలేదు. దేశ వ్యాప్తంగా ప్రజలు అందరు సర్దార్ పటేల్ గారి సేవలు గుర్తుంచుకొని వారు చేయగలిగినంత ఆర్ధిక సాయం చేసి ఆయనను గౌరవించుకున్నారు. అలానే శ్రీరామ మందిర నిర్మాణం కూడా భారతీయ ప్రజస్ వాహిని తమ రాముని తలచి ఉడతా భక్తి సహకారం అందించి జాతి గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. ఇంక ఇప్పుడు పార్లమెంటు భవన నిర్మాణం విషయంగా వస్తున్న విమర్శలు. అసలు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎంతకాలం క్రితం ప్రారంభ మయింది, జమాఖర్చులు ఎంత అనేది మనం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పటి పరిస్థితికి ముందు మనం గతంలో ఏమి జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం.

ప్రస్తుత పార్లమెంటు భవనం 1921 సంవత్సరంలో ఉపయోగంలోకి వచ్చింది. దాని రూపకర్తలు ఆ భవనానికి వంద సంవత్సరాల ఆయువుగా నిర్ణయించారు. అంటే ఆ భవన ఆయుష్షు ఈ సంవత్సరంతో తీరిపోతుంది. 2010 పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆనాటి PWD మంత్రిగారు జయపాల్ రెడ్డిగారు పార్లమెంటుకు తెలుపుతూ, పార్లమెంటు భవనం మెయింటెనెన్సు కష్టతరం, విపరీత ఖర్చు, భ‌వన ఆయుష్షు ఇత్యాదిక‌ విషయాలు ప్రస్తావన చేసి ప్రజా ప్రతినిధులు అందరూ క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రొత్త భవనం నిర్మిచుకోవలసినదే అని తెలియ చేశారు.

పార్లమెంటు సదస్సులో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంలో, భవన నిర్మాణ వ్యయం గురించి చర్చ జరిగింది. తర్జన భర్జనల తరువాయి 12 జులై, 2012లో మీరా కుమార్, అప్పటి స్పీకర్ గారు ఓ కమిటీ వేశారు. 2013 లో ఆ కమిటీ ₹.1277 కోట్లుగా తమ నివేదికలో తెలిపినది. మన ప్రియతమ మౌనమోహనం గారు ఆ నివేదికను ప్రక్కన ఉంచారు. బహుశా అప్పటికే ఆయన ఎదో ఊహించి వుంటారు, అదే UPA-2 చివరి సంవత్సరం అని అనుకుంటాను. 2019 వ సంవత్సరంలో మరలా CPWD మంత్రి వారు ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ, సంసదుల రక్షణ మరియు కాలం తిరిపోతున్న భవన ఆయుష్షు దృష్టిలో ఉంచుకొని వెంటనే పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టాలని నివేదిక ఇవ్వడం జరిగినది.
శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రపంచ టెండర్లు పిలవడం జరిగిపోయింది. ఆ టెండరు ఆత్మనిర్భర ప్రోగ్రామ్ క్రింద టాటా ప్రాజెక్ట్ వారికి ఇవ్వడం జరిగిపోయిన విషయం అందరికి తెలిసే వుండవచ్చును.
ఇంతకీ ఖర్చు వివరాలు, కాంగ్ వారు ₹.1277 కోట్లకు అంచనా వ్యయం అంటే, అదే టాటా వారు ₹.960 కోట్లకు ప్రాజెక్టుకు ఒప్పుకున్నారు. 6 సంవత్సరాల తరువాత అదే కాంగ్ వుండి వుంటే అంచనాలు మారి 12 వేల కోట్లు అయ్యుండేదేమో, అందుకే దైవం అంతా మార్చేసిందేమో అని ఢిల్లీలో గుసగుసలు. మోడీగారు, టాటా వారు ఆ ఖర్చును దాదాపు రు.300 కోట్లు తగ్గించి దేశానికి అందిస్తున్నారు.
ఇప్పటి పరిస్థితి 2022 నాటికి స్వతంత్రం వచ్చి 75 సం.లు పూర్తి అయ్యేనాటికి భవనం వాడుకలోకి రావాలని ప్రభుత్వ ఆశయంగా తెలుపుతున్నారు. 50 నుంచి 60 శాతం పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కొసమెరుపు ఏమిటంటే… ఈ కరోనా సమయంలో దేశం క్లిష్టపరిస్థితిలో ఉంటే మోడీ ఇల్లు కట్టుకుంటాడా అంటూ రంకెలు. అవును ఈ వ్యాసం చదివిన వారు ఆ భవనం మోడీగారి ఇల్లు అవుతుందేమో తెలుపగలరు.

ఢిల్లీ లుటీయను వారలు, కమ్మి, కాంగ్, jnu టుకడేలు, లుచ్చరికం గాళ్ళు మీకు సిగ్గు శరము, మానము, చీము, నెత్తురు ఉంటే తప్పుడు మాటలు మాట్లాడకండి. మోడీగారి ఇల్లు కాదురా అది దేశ ఆత్మగౌరవానికి గుర్తింపు. మన పార్లమెంటు సభ్యులు దేశం మొత్తాన్ని అక్కడ రిప్రజంట్ చేస్తారు. అన్నిపార్టీల వారు అక్కడ సంవత్సరంలో 6 లేదా 7 మార్లు కలుస్తారు. దేశ సమస్యలు చర్చిస్తారు. ఇది నిజమేగా. మొత్తానికి మీమీద మీకు నమ్మకం సన్నగిల్లి మరోమారు మోడీగారు ప్రధాని అవుతారు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నందుకు మిమ్ము మెచ్చుకోవాల్సిందే, అదే మోడీగారి ఇల్లు.

Writes – Anasuya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here