4 దశాబ్దాల తర్వాత ఒలింపిక్ కమిటీకి కి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
వచ్చే ఏడాది భారతదేశం అంతర్జా తీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సెషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. 1983 నుంచి ఐఒసి సీజన్ కు భారతదేశం ఆతిథ్యం వహించలేదు. ఒలింపిక్ చార్టర్ ఒలింపిక్స్ ఆతిథ్య నగరాల గురించిన కీలకమైన చర్చ ఐఓసి సభ్యులు నిర్వహిస్తారు. ఈ వార్షిక సమావేశం ఆతిథ్య దేశం ఎంపికకు జరిగిన ఓటింగ్ లో 76 చెల్లుబాటు ఓట్లలోను 75 ఓట్లు భారత్ కు వచ్చాయి. ఇప్పుడు ఈ కీలక సమావేశం ముంబైలో జరగనుంది. సభ్యులందరూ ఈ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చెందిన అతి పెద్ద సమావేశం. సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఐఓసి సెషన్ సమావేశం నిర్వహణ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. “2023 సంవత్సరపు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ నిర్వహణకు భారతదేశం ఎంపికయిందని తెలిసి ఆనందంగా ఉంది. ఇది కలకాలం గుర్తుండిపోయే ఐఒసి సెషన్ గా నిలిచిపోతుందని, ప్రపంచ క్రీడల కోసం సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుందని నాకు విశ్వాసం ఉంది” అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.