డా. సోమ‌శేఖ‌ర్ రావుకు ఇండియ‌న్ గ్యాస్ట్రో ఐకాన్ అవార్డు

0
126
Spread the love

డా. సోమ‌శేఖ‌ర్ రావుకు ఇండియ‌న్ గ్యాస్ట్రో ఐకాన్ అవార్డు

ప్ర‌ముఖ మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాలాజిస్ట్‌, జూబ్లీహిల్స్ అపోలో హాస్ప‌ట‌ల్‌కు చెందిన డాక్ట‌ర్ కే. సోమ‌శేఖ‌ర్ రావుకు అరుదైన గౌర‌వం ల‌భించింది. హెప‌టైటీస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు అత్యున్న‌త వైద్య సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు ఆ జ‌బ్బు బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా సేవ్ లీవ‌ర్ ఫౌండేష‌న్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా అవ‌ర్‌నెస్ కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నాయ‌న‌. ఇందుకు గానూ ప్ర‌తిష్టాత్మ‌క ఇడియ‌న్ గ్యాస్ట్రో బ్రాండ్ అవార్డుకు గ్యాస్ట్రో ఎంటారాలాజి విభాగంలో ఆయ‌న్ను ఢిల్లీకి చెందిన టైమ్ సైబ‌ర్ , డిజిట‌ల్ మీడియాలు ఎంపిక చేశాయి. న్యూడిల్లీలో జ‌రిగిన హెల్త్‌కేర్ ఐకాన్ -2021 కార్య‌క్ర‌మంలో బీసీసీఐ ఛీఫ్ సెలెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ.. డాక్ట‌ర్ కే. సోమ‌శేఖ‌ర్ రావుకు అవార్డుతో పాటు ప్ర‌శంస ప‌త్రాన్ని అంద‌జేశారు. అదే విధంగా సోమ‌శేఖ‌ర్ సేవానిర‌తీని కోనియాడారు. అవార్డు రావ‌డం ప‌ట్ల డాక్ట‌ర్ సోమ‌శేఖ‌ర్ ఈ సంద‌ర్భంగా సంతోషం వ్య‌క్తం చేశారు. త‌నపై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌న్నారు. లీవ‌ర్ సంబంధిత రోగుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు మ‌రింత కృషి చేస్తాన‌ని చెప్పారు. కార‌ణాలేమైన్న‌ప్ప‌టికీ.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గ‌ణ‌నీయంగా హెప‌టైటీస్ రోగులు పెరుగుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వైద్య సేవ‌ల్ని అందించేందుకు ఓ టీంను కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here