ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ కనుమూత‌..సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

0
185
Spread the love

ప్రముఖ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ కనుమూశారు. ముంబయ్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్. జనవరి లో కరోనా బారిన పడిన లతా మంగేష్కర్ ను బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కు చికిత్స అందించారు వైద్యులు. 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ కొవిడ్ భారినపడీ మరణించడం జీర్ణించుకోలేకపోతున్న సిని సంగీత అభిమానులు. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు లతా మంగేష్కర్. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో 1955 లో ANR సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాటలు ఆమె పాడారు. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు. ఆమె మ‌ర‌ణంతో శోక సముద్రంలో మ‌నిగిపోయారు సంగీత అభిమానులు.

సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతా జీ మరణం తో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్’ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.  “” 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్ల ను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు, కానీ, సింగర్ గా లతా జీ సమయం ఇచ్చినంక నే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ .. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వం లో వోలలాడించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షినాది కి సంగీత సరిగమల వారధి.
హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన , తన గాత్రం లో ఉర్దూ భాష లోని గజల్ గమకాల సొబగులను లాతాజీ గాత్రం వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది.” అని సీఎం స్మరించుకున్నారు. స్వర్గీయ లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.

ప్రముఖ నేపధ్య గాయని, భారత రత్న, భారత నైటింగేల్, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ పాల్కే వంటి అనేక పురస్కారాల గ్రహీత శ్రీమతి లతామంగేష్కర్ గారు నేడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తీవ్ర సంతాపం తెలిపారు.

మూగబోయిన గాన కోకిల కు శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కొప్పులఈశ్వర్

భారతరత్న గాయని లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here