సెప్టెంబ‌ర్ లో 7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ 

0
387
Spread the love

సెప్టెంబ‌ర్ లో 7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ 

7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంది. దుబాయ్ లో జ‌ర‌గ‌బోయే ఈ ఈవెంట్ కోసం ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు నిర్వాహ‌కులు. ఆగ‌స్ట్ 12న వెస్టిన్ హోట‌ల్లో సైమా గురించి ప్రెస్ మీట్ మీట్ జ‌ర‌గ‌నుంది. ఇదే ప్రెస్ మీట్ లోనే షార్ట్ ఫిల్మ్  అవార్డులు కూడా ప్ర‌క‌టించ‌నున్నారు. 

సైమాకు ఎంతోమంది తార‌లు దిగిరానున్నారు. రెడ్ కార్పెట్ పై చాలా మంది స్టార్స్ త‌ళుక్కుమన‌బోతున్నారు. 24 శాఖ‌ల్లో వాళ్లు వాళ్లు చేసిన కృషి.. టాలెంట్ ను గుర్తించి అవార్డులు అంద‌జేయ‌నున్నారు. సైమా గ‌త ఎడిష‌న్స్ దుబాయ్, షార్జా, మ‌లేసియా, దుబాయ్, సింగ‌పూర్, అబుదాబిల్లో జ‌రిగాయి. ఇక ఇప్పుడు ఏడో ఎడిష‌న్ మ‌రోసారి దుబాయ్ లోనే జ‌ర‌గ‌నుంది. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ రిటైల్ స్టోర్, ప్యాంటాలూన్స్ సైమాకు టైటిల్ స్పాన్స‌ర్ గా ఉండ‌బోతుంది. ఈ భారీ వేడుక‌ను హిమాల‌యా ఫేస్ వాష్ సమ‌ర్పించ‌నుంది.

*****

South Indian International Movie Awards will be held in Dubai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here