దేవాల‌యాల‌ ముందు గోపురం ఎందుకోసం .?

0
341
Spread the love

ఉత్తర భారతదేశంలో కన్న దక్షణ భారత దేశ దేవాలయాల ముందు గోపుర కట్టడాలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కంచిపురంలో దేవాలాయలకు వున్న గోపురాలు అత్యంత ఎత్తులో వుండి చాలా దూరం నుంచే ఆకర్శనీయంగా కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలు గోపుర నిర్మాణ ఉద్దేశ్యం ఆధ్యాత్మిక భావన అని హైందవధర్మం చెబుతుంది. ప్రధాన ఆలయానికి ముందు భాగాన కొంత ఖాళి ప్రదేశం తరువాత ప్రవేశ ద్వారంగా ఈ గోపుర కట్టాడాలు ఉంటాయి. అయితే తమిళనాడు లాంటి కొన్ని చోట్ల ఈ గోపుర నిర్మాణ ప్రధాన ఆలయానికి చుట్టు నాలుగు వైపుల నాలుగు గోపురాలు మనం చూడవచ్చు. ప్రధాన ఆలయం మరియు ఈ గోపుర నిర్మాణ ఆగమన శాస్త్ర ప్రకారమే జరుగుతుంది. గోపురం బహూళ అంతస్థుల సముదాయం. ఆ గుడి శైవం… వైష్నవం లలో ఎదైతే ఆ సంప్రాదాయల ప్రకారం తగిన శిల్పాలతో గోపుర నిర్మాణం ఉంటుంది.. స్థల ప్రముఖ్యతను బట్టి దేవాలయ నిర్మాణం చేస్తారు. హేతువాదులు , చరిత్రకారులు మాత్రం ఈ కట్టాడాలు ప్రజలకు శిల్ప కాళాకారులకు ఉపాధి కొరకే రాజులు నిర్మించేవారు అని చెబుతుంటారు. అలాగే ఎత్తైన కట్టాడలు రాజులకు రక్షణ గోడల మాదిరిగా , శత్రు సైనికుల రాకడను కనిపెట్టకోవాడకికి ఉపయోగపడేవి. ఎత్తైన కట్టడం గోపురం పిడుగుపాటు నుంచి కాపాడుతుందని సైన్సు చెబుతుంది. సాధారణంగా ఆ రోజుల్లో గ్రామల్లో నివాస కట్టాడాలు అన్ని మాములు ఎత్తులోనే వుండేవి . రెండంతస్థులకు మించివుండేవి కావు. ఇలాంటి గ్రామాలను పిడుగుబాటు నుంచి ఎత్తైన గోపురాలు కాపాడేవి.
అధ్యాత్మిక భావన ప్రకారం చూసిన, సైన్సు ప్రకారం చూసిన గోపురం అనేది పిడిగుబాటు నుంచి కాపాడుతుంద‌ని చెబుతుంటారు.


   Writes VSK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here