అంటు వ్యాధులు ప్రపంచ దేశాల లుచ్చరిక రాజకీయాలు…

0
122
Spread the love

అంటు వ్యాధులు ప్రపంచ దేశాల లుచ్చరిక రాజకీయాలు…

ప్లేగు వ్యాధి ప్రబలింది ప్రపంచ ప్రజలు అతలా కుతలం అయ్యారు, కానీ అదే ప్రజలనుంచి మానవత్వం పుట్టింది కొంతమంది వైద్యజాతి మానవ జాతిని కాపాడాలనే సంకల్పంతో నడుముకట్టి ఆ వ్యాధిని కట్టడి చేశారు.

క్షయ వ్యాధి ప్రబలింది. పిట్టల్లాగా మనుషులు అంతరించి పోవడం మొదలయ్యింది. వైద్యో నారాయణో హరిహి అంటూ ఆ హరి మరలా తీవ్రప్రయత్నం ప్రయాస చేసిన మీదట, కొంత జనహననం పిమ్మట మందు కనుక్కోవడం దానితో వ్యాధి కట్టడి జరిగింది.

పోలియో వ్యాధి ప్రబలింది. ఎన్నో లక్షలమంది ప్రజలు అష్టావక్రులుగా మారిపోయారు. తమ జీవన సంధ్యను ఉషోదయం లేదనే నిరాశతో గడిపేశారు, గడిపేస్తున్నారు. మరలా వైద్య జాతి ముందుకు నిరాశా నిస్పృహలతో వున్న ప్రజలలో చైతన్యం నింపి వారికి వెన్నుతట్టి వెన్ను నిలిపిన, నిలుపుతున్న ఉదంతం మనం చూస్తూనే వున్నాము.

అతివృష్టి, అనావృష్టి కారకాలను మనిషి గమనిస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితులలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి, వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి మనిషే తాపత్రయ పడి ఆనకట్టల నిర్మాణం, నీటి వాడకంలో జాగ్రత్తలు, ఎక్కడ నీరు లభించక పంటలు పండక ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడకు గంగమ్మతల్లిని తరలించి ఆయా ప్రదేశాలలో జనక్షయం నుంచి కాపాడుతున్నది అదే ప్రజలు.

మానవుడు ఉద్భవించిన సమయం నుంచి తన జీవన వికాసం కొరకు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఆధునిక మానవ వికాసం సాధించి మేము ఆధునికులము మేమే నాగరికులము అని గొప్పలు పోతున్న ఈ మనిషి ఒక చిన్న ఎదురుదెబ్బకు కుదెలుమనడం లేదా!

ఆధునిక ప్రజల మధ్యన అంతరాలు, ఈ ధరిత్రి దేశాలుగా విభజన. ఆదేశాలకు ఎల్లలు తమలో తాము చర్చించుకుని నిర్ణయించిన వైనం ఇదికూడా మన ముందే జరిగిపోయింది.

రెండు ప్రపంచ యుద్ధాలు మానవాళి జీవితాలను వినాశనం పట్టిస్తే, నేను గొప్ప నామాట వినాలని కొన్నిదేశాలు ప్రపంచాన్ని శాసించే స్థితిని అలవరుచుకున్న వేళ దేశ ఎల్లలు మారిపోయి బానిస దేశాలు స్వతంత్ర వాయువులు పీల్చినట్లు అనిపించినా ఉన్నతులము అనుకునే దేశాలు తమ శాసన తపనను కొనసాగించడం చూస్తూనే వున్నాము.

ఉన్నతులైన ఈ ఆధునిక దేశాలు జల ప్రళయాలను, అగ్ని ప్రళయాలను, భూ ప్రళయాలను, బీభత్స తుఫానులను కట్టడి చేయగలుగుతున్నారా? ఆ వైజ్ఞానికులు ఆదిశగా ప్రయాస చేసినా ఫలితం మాత్రం సుదిమొన అంతమాత్రమే విజయం సిద్ధించింది అనేది సత్యదూరం కాదు కదా!

అసలు సిసలైన కారణం ఇదే మానవులు కేవలం తమ పుర్రెలో కలిగిన కొన్ని ఆలోచనలను ప్రభావితం చేయడం కొరకు దేశ దేశాలలో అశాంతి అలజడి రేపి తాము సుఖము పొందక ఇతరుల సుఖమును ధ్వంసం చేసి ప్రజా జీవనాన్ని అలజడి పాలు చేసుకుంటున్న ఆధునిక మానవుడి చరిత్రనే ఇప్పటి మన జీవన వికాసం అనిపిస్తోంది కదా!

కారణం తనకున్న దానితో తృప్తి చెందని మానహీనుడైన మానవుడే. ఎవడీ మానవుడు ఓ సామాజిక పశువు. ఎందుకు ఈ విధమైన ప్రవర్తన అంటే నేను కూడా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవచించాను అని చాటుకోవడమే.

నేను, నా అనుకునే ప్రపంచ గమనం కాదు, కానీ మనము మన అనే ప్రపంచం ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడుతుంది అనేది ప్రపంచదేశాలు యోజన చేయాలి.

అసలు ఆవిధంగా అనుకునే ప్రపంచం వున్నదా అంటే వున్నది అనేది నిత్యసత్యం.

ఈ ఆధునిక ప్రపంచదేశాలు సాధించింది ఏమిటి? హింసా, అసూయా, ద్వేషం వెరశి తాము ప్రశాంతతను కొల్పివడమే. మరి ఈ పైని పదాలకు తవివ్వని ప్రాంతం.. అదే అతిప్రాచీన ఆధునిక నాగరికత కలిగిన ప్రస్తుత భారతదేశం, భరత వర్షం, భారత ఖండం, ఆర్యావర్తం…

ఏమి వున్నది ఇక్కడ. దాదాపు పదివేల సంవత్సరాల క్రితమే, విమానాల్లో విహరించారు, కేవలం మనః సంకల్పంతో ఖండతరాల ఆవల వున్న మనిషితో మాట్లాడగలిగారు. సంతాన సాఫల్యం కోరగానే సిద్ధించుకున్నారు, గుండె మార్పిడి, పిండ మార్పిడి, వనాలు, మాన్యాలు, తోటలు పచ్చటి ప్రకృతిని తయారు చేశారు. ఆధునికతకు అద్దం పట్టే మాయసభ నిర్మాణం. ఎన్నోడేవాలయాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, నీరు, గాలి, వెలుతురు వచ్చేవిధంగా నిర్మాణాలు నేటి అత్యాధునిక వైజ్ఞానికుల తెలివికి అందనంత దూరంలో చేయడం.
మనవేదాలు పూర్తి వైజ్ఞానికం. ఎవరికీ అందని మేధో సంపత్తి. ఆధునిక యుద్ధతంత్రాల నుంచి ప్రజావసర జీవనానికి ఇది లేదు అని విధంగా సాధించిన సంపత్తి.
భారతదేశం ఏమంటున్నది. ప్రపంచం మొత్తం శాంతి కలగాలి, సర్వేజనాః స్సుఖినోభావంతు, ఓం శాంతి శాంతి శాంతిః…

అత్యాశ, అసూయ, విద్వేషం కలిగిన ఉన్నత దేశాలు కేవలం తమ వారు, తమ దేశం మాత్రమే బాగుండాలి అనే సూత్రంతో అన్యదేశాల నాగరికథలను అణచివేసి ముందుకు సాగి సాధించింది శూన్యం. పైగా వారి వేళ్ళు వాళ్ళు కాల్చుకోవడం, వారి కళ్ళు వాళ్ళు పొడుచుకోవడం మాత్రమే.

భారత్ ప్రకృతితో మమేకమైన దేశం. పసుపు, కుంకుమ, వేప, రావి…ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టు, పుట్ట, గాలి, పశువులు, మృగాలు, కొండలు, గుట్టలు, పురుగులు, ఆకులు, పసర్లు అన్నింటితో కలసి మెలసి జీవించే ఈ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తూ తమ తమ దేశాలలో వధునికం అంటూ అనాగరిక మానవుల ప్రవర్తన, విచ్చలవిడి జీవనం, కనిపించే ప్రకృతిని నాశనం చేసి బతకాలనే తాపత్రయం మనమీద చూపించే క్రమంలో ఇక్కడి కొన్ని దుష్ట శక్తులు వారికి సహకరించి తాము నిల్చున్న కొమ్మనే నారికేసి కిందపడగానే అయ్యో అనే దుష్టచరితులు తమ అశాంతి, అనాదరణ, సంఘవ్యతిరేక కార్యకలాపాలను రాజకీయ చతురత చూపించి చేస్తున్న మారణ హోమం ఒకరోజు వారిని పూర్తిగా కాటేయకపోదు.

కరోనా రాజకీయంతో శత్రుదేశాలు చేస్తున్న మారణ హోమానికి, శవాలమీద పేలాలు ఏరుకుంటు తమవంతు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్న మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు.

లుచ్చరిక రాజకీయులారా తస్మాత్ జాగరత వీలైతే మనుషుల జీవితాలు కాపాడండి, ఫలాని దేశ వస్తువులు వాడండి అంటూ వత్తిడి చేసి ప్రజలను ప్రమాదకర వైరస్ మింగేసేలా చేసి తద్వారా వారి మందులు ఇక్కడ మార్కెట్ చేసుకొని దేశాన్ని ఆర్ధికంగా అనగతొక్కలనుకొనే మీకు తగిన శాస్తి జరుగుతుంది…

లుచ్చరిక రాజకీయం లుచ్చా వారే చేస్తారు…

Writes – Anasuya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here