అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సంద‌ర్భంగా మహిళా చట్టాలపై అవగాహన

0
110
Spread the love


అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సంద‌ర్భంగా మహిళా చట్టాలపై అవగాహన

ఆడపిల్లలు పట్ల సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావలసిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ రోజు హైదరాబాద్ రవీంద్ర భారతి లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుకొని మహిళా చట్టాలపై అవగాహన కల్పించించింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఉత్సవాలకు ముఖ్య అతిధిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్వవతి రాథోడ్ గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ దివ్య దేవరాజన్, ఐఏఎస్ మరియు విహబ్ సీఈవో దీప్తి రావుల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరి భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్ , గడ్డలా పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు మరియు సెక్రటరీ కృష్ణ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించి అవార్డులు అందించారు. చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పుషులతో అన్ని రంగాల్లో సమానంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని పరీక్షించడమే కాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందన్నారు. ఆడ మగ అంటూ బేధాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని సమన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందన్నారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. ఆడపిల్లలు ఏ సమస్య ఉన్న ధైర్యంగా ఎవరికీ బాయపడకుండా ఎదుర్కోవాలని అన్నారు. ‘ఆడపిల్ల చదువు ఇంటికి,సమాజానికి వెలుగు’ అని సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా చదువులో కానీ ఏ రంగంలో కానీ లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవాలని కోరారు. ఆడవారికి ఏ ఇబ్బంది ఉన్న మీకు తోడుగా తెలంగాణ విమెన్ కమిషన్ అండగా ఉంటుంది అని గుర్తుచేశారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చిన తక్షణమే మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావాలని తద్వారా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో సమస్యలతో కమిషన్ కి రాలేకపోయే వారికీ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని గుర్తు చేసారు. మీరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మరియు Email: telanganastatewomenscommission@gmail.com ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ 9490555533 ను రాష్ట్ర మంత్రులు ఇంద్రారెడ్డి గారు మరియు సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళ దినోత్సవం ఒక్క రోజే కాదు ప్రతిరోజు మహిళల రోజే అన్నారు. గత ప్రభుతవలు మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వలేదని గుర్తించి సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిజేశారు. మహిళల అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటామన్నారు. తెలంగాణ మహిళ కమిషన్ మహిళల సమస్యలు పరిష్కరించడంలో దేశానికే ఆదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇందుకు కమిషన్ సభ్యులను మనస్పూర్థ్యగా అభినందిస్తున్నానన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళ దినోత్సవ సంబరాల్లో భాగంగా మహిళలందరికీ శుభాకాంక్షలు.. పిల్లలకు శుభాశీసులు తెలిపారు.సమాజంలో మహిళల కోసం తెలంగాణ ప్రభుతం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నదని అన్నారు. ప్రతి ఒక్కరు తన తల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని, అమ్మ కంటే రోల్ మోడల్స్ ఇంకెవరు లేరని అన్నారు. అవకాశాలు కల్పిస్తే మహిళలు అద్భుతాలు సృష్టించగలరని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పిస్తూ తెలంగాణాలో మహిళల్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎస్సి, ఎస్టీ అమ్మాయిల కోసం 55 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here