సుడిగాలి సుదీర్ ని పక్కన పెట్టిన ఈటీవీ యాజమాన్యం.. ఫ్యాన్స్ షాక్.?

0
229
Sudigali Sudheer
Spread the love

ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ బుల్లితెర సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ కి ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత తనదైన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత టీం లీడర్ గా మారిన సుడిగాలి సుదీర్ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీం కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

కేవలం సుడిగాలి సుదీర్ ఏదైనా షో లో కనిపించాడు అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ప్రతి ఈవెంట్ లో సుధీర్ స్పెషల్ రోల్ చేస్తూ ఉంటాడు. ఇక సుడిగాలి సుదీర్ కూడా ప్రతి ఈవెంట్ లో కూడా అదిరిపోయే కామెడీ పంచుతూ ఉంటాడు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది ఈటీవీ యాజమాన్యం. ఇక ఈవెంట్కి అత్తో అత్తమ్మ కూతురో అనే టైటిల్ కూడా పిక్స్ చేసింది.

ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలయింది. అయితే ఈటీవీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో కీలకంగా ఉండే సుడిగాలిసుధీర్ ఇటీవలే ఈటీవీ ప్లాన్ చేసిన సంక్రాంతి ఈవెంట్ లో మాత్రం కనిపించకపోవడం ఫ్యాన్స్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సంక్రాంతి ఈవెంట్ లో సుడిగాలి సుదీర్ ని ఎందుకు ఈ టీవీ యాజమాన్యం దూరం పెట్టింది అని ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఏంటి అనే దానిపై ప్రస్తుతం బుల్లితెరపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here