ఘ‌నంగా కొన‌సాగుతున్న‌ పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర

0
138
Spread the love

 ఘ‌నంగా కొన‌సాగుతున్న‌ పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర

        భ‌క్తులు లేకుండానే కొన‌సాగురున్న ర‌థ‌యాత్ర

    భ‌క్త జ‌న‌కోటికి రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ / భువ‌నేశ్వ‌ర్‌: జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఒడిశాలో పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ఘ‌నంగా కొన‌సాగుతున్న‌ది. పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా భ‌క్త జ‌న‌కోటికి రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా ఒడిశాలోని భ‌క్తులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌గ‌న్నాథుడి ఆశీర్వాదంతో.. దేశ ప్ర‌జ‌లంద‌రూ జీవితాంతం ఆనందంతో, ఆయురారోగ్యాల‌తో నిండి ఉండాల‌ని కోరుకుంటున్నానని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.క‌రోనా కార‌ణంగా జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌ను ఒడిశా ప్ర‌భుత్వం ఈ ఏడాది పూరీకే ప‌రిమితం చేసింది. గ‌తేడాది మాదిరిగానే భ‌క్తులు లేకుండా ర‌థ‌యాత్ర కొన‌సాగ‌నుంది. ర‌థ‌యాత్ర నేప‌థ్యంలో పూరీలోని అన్ని దారుల‌ను మూసివేసి, రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశారు. రేపు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పూరీలో క‌ర్ఫ్యూ విధించారు. పూరీలోకి ఇత‌ర ప్రాంతాల నుంచి భ‌క్తులు రాకుండా ఉండేందుకు క‌ర్ఫ్యూ విధించింది ఒడిశా ప్ర‌భుత్వంక‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కార‌ణంగా గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్ర‌భుత్వం భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోయినా.. పూరీ రాజు, వేది పండితులు, ఆల‌య అర్చ‌కులు, సిబ్బంది క‌లిసి రథయాత్రను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆషాఢ శుక్ల విదియ నాడు అంటే ఇవాళ.. వేద‌ పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉత్స‌వ‌మూర్తుల‌ను క‌దిలించ‌డం ద్వారా ర‌థ‌యాత్రా ప‌ర్వం మొద‌లైంది.అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేశారు. ఈ ఉత్సవాన్ని పహండీఅంటారు. ఆ త‌ర్వాత‌ గుండిచా ఆలయానికి వెళ్లేందుకు ఉత్స‌వ‌మూర్తులు ర‌థంపై సిద్ధమై ఉండ‌గా.. ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాలను అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను ఊడ్చాడు. దీన్నే చెరా పహారాఅంటారు.మ‌హారాజు బంగారు చీపురుతో ర‌థాల‌ను ఊడ్చిన అనంత‌రం ర‌థ‌యాత్ర మొద‌లైంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here