తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చైర్మన్… సభ్యులు వీరే

0
160
Spread the love

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌
చైర్మన్… సభ్యులు వీరే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చైర్మన్, సభ్యులుగా అర్హులైన సమర్థత కలిగిన నిజాయితీ పరులైన ఉన్నతాధికారులు, భాషా పండితులు, డాక్టర్, ఇంజనీర్, మహిళ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు జర్నలిస్టు రంగాలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేసిన సభ్యులను గవర్నర్ నియమించారు. ఈ మేరకు.. చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ) … సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)., కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్ ఎ ఎల్ ఎల్ బీ., స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) సుమిత్రా ఆనంద్ తనోబా (ఎమ్ ఏ తెలుగు., తెలుగు పండిట్ )., కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి) ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎమ్ ఎస్(ఉస్మానియా)., ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్) ఆర్. సత్యనారాయణ (బిఎ., జర్నలిస్ట్)…లను సిఎం కేసీఆర్ ఎంపిక మేరకు గవర్నర్ నియమించారు.

ఈ సందర్భంగా నియమితమైన చైర్మన్ సభ్యుల గురించి తెలుసుకుందాం…
డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ) :

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎంపికైన బి.జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పెద్దాయపల్లికి చెందిన వారు. ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధత, నిజాయితీతో పనిచేసి మచ్చలేని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్.వీ.ఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఆయన 1990లో ఎపిపిఎస్సీ ద్వారా డిప్యూటి కలెక్టర్ గా ప్రభుత్వ ఉన్నతాధికారిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తరువాత నల్లగొండ ఆర్డీఓగా, కరీంనగర్ లో హౌసింగ్ శాఖ జిల్లా మేనేజర్ గా, డీఆర్డీఏ పీడీగా, హైదరాబాద్ లో ఎంప్లాయిమెంట్ జనరేషన్ మిషన్ సీఈఓగా, మెప్మా డైరెక్టర్ గా, వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా అనేక పదవులకు వన్నెతెస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖల కమిషనర్ గా, సహకారశాఖ రిజిస్ట్రార్ గా, శాతవాహన యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఎం.డీ.గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ గా, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. టిఎస్ పీఎస్సీ చైర్మన్ గా సిఎం కెసిఆర్ ఎంపిక చేసి, గవర్నర్ నియమించేనేటికి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా, కాకతీయ యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీగా పనిచేస్తున్నారు.

అదే సందర్భంలో సభ్యుల ఎంపిక పై కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అవుతున్నది. వారి గురించిన వివరాలు వారు సమాజానికి చేస్తున్న సేవలు వారి నేపథ్యం గురించి తెలుసుకుందాం….
రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ) :
రమావత్ ధన్ సింగ్, నల్లగొండ జిల్లా దేవరకొండ కు చెందిన జాత్యానాయక్ తాండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పట్టా పొందారు. పబ్లిక్ హెల్త్ శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఎదుగుతూ ఇఎన్సీ ఉన్నత పదవిని అధిరోహించారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులను సమర్దవంతంగా నిర్వర్తించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పలు ఫ్లై ఒవర్ లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు వంటి అభివృధ్ది కార్యక్రమాలలో రమావత్ ధన్ సింగ్ భాగస్వాములై ప్రతిభావంతంగా పనిచేశారు.
ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి) :
ప్రొఫెసర్ బండి లింగారెడ్డి ఖమ్మం జిల్లా వేమ్సుర్ గ్రామానికి చెందిన వారు. కందూకూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటిలో రేడియెషన్ ఫిజిక్స్ లో పట్టా పొందారు. ప్రముఖ చైతన్య భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 1996లో చేరారు. అప్పటి నుంచి 25 ఏళ్లుగా సిబిఐటిలొ వివిధ స్థాయిల్లో ఎదిగి ప్రస్తుతం ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. విస్త్రుత స్థాయి రీసర్చ్ ద్వారా వీరు రాసిన కీలకమయిన పలు జర్నల్స్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచాయి. ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి జాతీయ సెమినార్లు, సమావేశాలు నిర్వహించారు.
కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్మె ఎల్ ఎల్ బీ., స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) :
టిఎస్ పీఎస్సీ సభ్యురాలిగా నియమితులైన ముదిరాజ్ బలహీనవర్గానికి చెందిన కోట్ల అరుణకుమారి ఎంఎ, ఎల్.ఎల్.బి. ఉన్నత విద్యనభ్యసించారు. ప్రస్తుతం వికారాబాద్ లో భూ భారతి జాయింట్ డైరెక్టర్ గా, జాయింట్ క లెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
సుమిత్రా ఆనంద్ తనోబా (ఎమ్మే తెలుగు., తెలుగు పండిట్ ) :
సమిత్రానంద్ తనోబా కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారిణి. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలం 2001 నుంచి కెసిఆర్ అడుగుజాడల్లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. తెలుగు భాషా పండితులుగా ప్రభుత్వ టీచర్ గా విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పుతూనే మహిళా ఉద్యమకారిణిగా తెలంగాణ కోసం అహర్నిషలు పాటుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫోరమ్, తెలంగాణ రచయితల వేదికలకు వైస్ ప్రెసిడెంట్ గా, తెలంగాణ భాషా వేదికకు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పల్లెలోని ఆరెక్షత్రియ వెనబడిన వర్గానికి చెందిన తెలంగాణ ఉపాధ్యాయ మహిళా ఉద్యమనేతను టిఎస్ పీఎస్సీ సభ్యురాలిగా నియమించడం పట్ల అటు తెలంగాణ వాదుల్లో ఇటు మహిళా ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్తక్యం అవుతున్నది.ఈ నిర్ణయాన్ని బీసీ మహిళా ఉపాధ్యాయ లోకానికి సిఎం ఇచ్చిన గౌరవంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి) :
కారం రవీందర్ రెడ్డి గురించి తెలియని తెలంగాణ ఉద్యమకారుడున్నారంటే అతిశయోక్తే అవుతుంది. వొక ప్రభుత్వ ఉద్యోగిగానే కాకుండా తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమాన్ని నాటి ఉద్యమ రథసారధి కెసిఆర్ పిలుపు నందుకుని క్రియాశీలంగా నడిపించిన టిఎన్జీవో (మాజీ అధ్యక్షుడు) నాయకుడికి సభ్యునిగా నియమించడం పట్ల తెలంగాణ ఉద్యోగ సంఘాలతో పాటు తెలంగాణ వాదుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కారెం రవీందర్ రెడ్డిని టిఎస్ పీఎస్సీ సభ్యునిగా సిఎం కెసిఆర్ ఎంపిక చేయడం అంటే…తెలంగాణ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నారు.
ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎమ్ ఎస్(ఉస్మానియా).
డా.ఆరవెల్లి చంద్రశేఖర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామస్తులు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఎఎంఎస్ చేశారు. తన భార్య కూడా డాక్టర్. ఇరువురు వారి స్వగ్రామం ముస్తాబాద్ లో ఆసుపత్రి నెలకొల్పి పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. నవజ్యోతి అనే వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా దుబ్బాక, సిరిసిల్లా ప్రాంతంలోని వృద్ధులకు వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తోటి డాక్టర్ల సహాయంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోశించారు. వీరి నియామకం పట్ల తెలంగాణ వైద్య వర్గాలు సహా తెలంగాణ విద్యావంతులు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్. సత్యనారాయణ (బిఎ., జర్నలిస్ట్) :
ఆర్. సత్యనారాయణ తెలంగాణ జర్నలిస్టుగా ఉద్యమ కారునిగా సుపరిచిరుతుడు. పేద పద్మశాలి వర్గానికి చెందిన సత్యనారాయణ, మెదక్ జిల్లా వరిగుంతం గ్రామానికి చెందిన వారు. బి.ఎ డిగ్రి చేశారు. ఈనాడు, ఉదయం, వార్త వంటి దినపత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిఎం కెసిఆర్ పిలుపునందుకుని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. వీరి సేవలను గౌరవించిన సిఎం కెసిఆర్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం కెసిఆర్ ఆదేశాలమేరకు ఆరేండ్ల ఎమ్మెల్సీ పదవిని ఆర్నెల్లకే వదిలేసి తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకారునికి పదవి ముఖ్యం కాదు తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యం అని చాటిచెప్పారు.వీరి నియామకం పట్ల బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ జర్నలిస్టు సమాజం తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here