ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: గవర్నర్ బండారు దత్తాత్రేయ

0
271
Spread the love

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: గవర్నర్ బండారు దత్తాత్రేయ

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ప్రత్యేకమని.. ప్రజాస్వామ్యంలో వారి స్థానం అత్యంత విలువైనదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా జర్నలిస్టులు మరింత చురుగ్గా వ్యవహరిస్తూ.. సమాచారాన్ని క్షణాల మీదుగా ప్రజలకు చేరవేయడం అభినందనీయమన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) డైరీని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజం అనేది ఓ టాస్క్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులే కీలకమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు అభినందనీయులని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సలహాదారు శ్రీ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ జర్నలిజం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం వంటిది అని అని అని అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్ర రావు గారు మాట్లాడుతూ తమకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పక్కనపెట్టి ప్రజల సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు నిరంతరం తపిస్తున్నారు అని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు చిలుకూరు అఖిలేష్, పలువురు జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here