వైఎస్‌ని తిడుతుంటే ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?: జేసీ

0
102
Spread the love

వైఎస్‌ని తిడుతుంటే ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?: జేసీ

అనంతపురం జూలై 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ >: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై  దీనిపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని  పేర్కొన్నారు.తెలంగాణకు ద్రోహం చేశారని… రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బండ బూతులు తిట్టే ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ  పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని..  అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు. దీనిపై ఒకరిద్దరు ఏపీ మంత్రులు మినహా పెద్దగా ఎవరూ స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here