శుభ ముహూర్తంలో….నామినేషన్ వేసిన ఎంపి కవిత

0
512
Spread the love

హైదరాబాద్ – నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ కు వెళ్లారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కలిసి ఆమె వెంట కలెక్టర్ కార్యాలయానికి నామినేషన్ పత్రాలతో బయలుదేరారు. అయితే,ఆ కారును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా నడిపగా.. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెనక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత నివాసం ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానంతో పిలిపించుకున్న మహారాష్ట్రకు చెందిన డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది. ఈ సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఎంపి కల్వకుంట్ల కవిత రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ వేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ…జిల్లా, రాష్ట్ర అంశాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రస్తావించానని చెప్పారు. రాష్ట్ర విభజన, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎట్లా కొట్లాడామో ప్రజలు చూశారని.. ఇక,5 ఏళ్లలో నా పనితీరుకు మెచ్చి పార్టీ అధిష్టానం మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు. అయితే, తాను ఇక్కడి ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా…మరో సారి తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలనిి విజ్ఞప్తి చేసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 16కు..16 ఎంపి స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, గులాబీ జెండా ఎగురవేయాలని ని కవిత ఈ సందర్భంగా కోరింది. మేం గల్లీలో ప్రజలకు సేవకులం…డిల్లీలో సైనికులం…అని ఎంపి కవిత మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, రవాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్,కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు బి గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ అమీర్, కె.విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here