ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ నటుడు.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

0
375
Junior NTR
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు విలన్‌గా కన్నడ స్టార్ నటుడు నటించబోతున్నారు అనేది లేటెస్ట్ అప్‌డేట్. ఆయన ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే నటించబోతున్న విషయం తెలిసిందే. RRR షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ మొదలుపెడతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ RRR షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ రూమర్ ప్రస్తుతం వినిపిస్తోంది.
త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర నటించనున్నారని ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం ఉపేంద్రతో త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నారట. త్రివిక్రమ్‌తో ఇప్పటికే ఉపేంద్ర పనిచేశారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన్ని విలన్‌గా కూడా త్రివిక్రమ్‌ ఒప్పిస్తారనే టాక్ నడుస్తోంది.తనకు పాత్ర నచ్చితే తెలుగులో కూడా నటించడానికి సిద్ధమని ఆ మధ్య ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పారు. పాత్ర నచ్చడంతో వరుణ్ తేజ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఉపేంద్ర విలన్ అనే వార్త నిజ రూపం దాల్చుతుందో లేదో చూడాలి. కాగా, ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here