రవీంద్రభారతి లో కవి సమ్మేళనాలు

0
231
Spread the love

రవీంద్రభారతి లో కవి సమ్మేళనాలు

*స్వతంత్ర భారత అమృతోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 3 న అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతి లో కవి సమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు / మహోత్సవముల కమిటీ సభ్య కార్యదర్శి మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.కవి సమ్మేళనానికి “స్వాతంత్ర స్ఫూర్తి” ని “ధీమ్” గా నిర్ణయించినట్లు తెలిపారు.75 వ స్వాతంత్ర భారత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు నిర్వహించనున్నట్లు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఈ నెల 12 న పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రారంభ వేడుకల్లో ప్రకటించారు. తదనుగుణంగా స్వాతంత్ర పోరాట ఘట్టాలు గురించి నేటి తరం యువత, పిల్లలకు అవగాహన కల్పించుటకై స్వతంత్ర భారత అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఏప్రిల్ 3 న” కవి సమ్మేళనం” నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు . జిల్లా కేంద్రాలలో నిర్వహించే కవి సమ్మేళనాల పై మీడియా సహకారంతో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here