జాతీయ క్రీడ‌ల‌కు ఎంపికైన కేశవ్ మెమోరియల్ విద్యార్థి

0
138
Spread the love

జాతీయ క్రీడ‌ల‌కు ఎంపికైన కేశవ్ మెమోరియల్ విద్యార్థి

(TOOFAN – Hyderabad)

జాతీయ ఫెడరేషన్ కప్ రెజ్లింగ్ ఛాంపియన ఫిష్ పోటీలకు నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ జూనియర్ కళాశాల చెందిన సీ.ఈ.సీ. ప్రథమ సంవత్సరం చెందిన క్రీడాకారుడు నాగారం ఆదిత్య ఎంపికయ్యారని కాలేజీ ప్రిన్సిపాల్ కె.సత్యనారాయణ తెలిపారు.

ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అండర్ -17 బాలుర విభాగంలో ఆదిత్య పాల్గొంటారు. ఇటీవల యాకత్ పురా లోని అలీ వస్తాద్ రెజ్లింగ్ అకాడమీ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ ఛాంపియన్ష ఫిష్ పోటీల్లో 48 కేజీ విభాగంలో ఆదిత్య చక్కటి ప్రతిభను కనబరిచి హైదరాబాద్ జిల్లా జట్టుకు స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. ఆదిత్య పెద్ద తండ్రి ప్రముఖ రెజ్లింగ్ కోచ్ జ్ఞానేశ్వర్ వద్ద ఆయన శిక్షణ పొందారు. జాతీయ పోటీలకు తమ కళాశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల కేశవ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కె. సత్యనారాయణ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మయ్య అధ్యాపకులు ఆదిత్యను అభినందించారు. జాతీయస్థాయిలో పతాకాన్ని గెలుచుకోవాలని ఆశా భావని వారు వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here